Nithiin Robinhood : నితిన్ దూకుడు పెంచాడుగా

నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ కు సంబంధించి దూకుడు పెంచుతున్నాడు. అదే డేట్ లో మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉందని చెబుతున్నా అతను తగ్గడం లేదు. అంటే పవన్ మూవీ రావడం లేదు అనే పక్కా సమాచారం వీరి వద్ద ఉందనుకోవచ్చు. రాబిన్ హుడ్ నితిన్ తో పాటు దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ శ్రీ లీలకు కూడా కీలకం అనే చెప్పాలి. అందుకే అగ్రెసివ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి తీరతాం అనే కాన్ఫిడెన్స్ మొత్తం టీమ్ లో కనిపిస్తోంది. అనుకున్న దానికంటే మూడు నెలలు పైనే ఆలస్యం అయినా కంటెంట్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు.మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మళయాల నటుడు షైన్ టామ్ చాకోతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక మార్చి 28న టాలీవుడ్ లో గట్టి పోటీయే ఉండే అవకాశం ఉంది. రాబిన్ హుడ్ తో పాటు యూత్ లో మోస్ట్ అవెటెడ్ మూవీ అనిపించుకున్న మ్యాడ్ స్క్వేర్ వస్తోంది. ఆ ముందు రోజు ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న 'ఎల్ 2 ఎంపూరన్' ఉంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం లూసీఫర్ కు సీక్వెల్.అలాగే మార్చి 27కే తమిళ్ నుంచి విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్ కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా రాకపోవచ్చు అనే ఊహాగానాలున్నాయి. మొత్తంగా రాబిన్ హుడ్ తో నితిన్ మాత్రం ఈ మూవీ కోసం దూకుడుగా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com