Nithiin : నితిన్ మూవీ వస్తుందా లేదా..?

నితిన్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని రోజులుగా రాబిన్ హుడ్ ను వాయిదా వేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తోన్న పుష్ప 2 నిర్మాతలు కూడా వాళ్లే కదా. అయితే పుష్ప 2 మేనియా ఓ రేంజ్ లో ఉంది. ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. క్రిస్మస్ బరిలో కూడా తెలుగు నుంచి టాప్ హీరోల సినిమాలేం లేవు. అందుకే ఆ టైమ్ వరకూ పుష్ప 2ను ఆపగలిగితే తెలుగులో కూడా కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అని భావిస్తున్నారు.
నిజానికి పుష్ప 2 కు తెలుగులో కలెక్షన్స్ లేవు. ఫస్ట్ పార్ట్ సైతం ఫ్లాప్ గా తేలితే కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ కు నిర్మాతలే డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి ఈ పార్ట్ కు కూడా రిపీట్ అయ్యేలా ఉందంటున్నారు. ఇప్పుడు టికెట్ ధరలు తగ్గాయి. క్రిస్మస్ వరకూ ఈ మూవీని ఆపగలిగితే ఇంతకు ముందు టికెట్ ధరలు భారీగా ఉన్నాయని చూడనివాళ్లు కూడా పండగ శెలవుల్లో ఈ చిత్రాన్ని చూస్తారు. తద్వారా తెలుగులో కూడా కమర్షియల్ గా విజయం సాధించొచ్చు అనుకుంటున్నారట.
బట్ మైత్రీ వాళ్ల ప్రతిపాదనను హీరో నితిన్ అంగీకరించలేదని.. అవసరమైతే నైజాంలో తనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అన్నాడని చెప్పారు. బట్.. మైత్రీ ముందు నిలవడం నితిన్ కు సాధ్యమా. అందుకే ఆల్మోస్ట్ రాబిన్ హుడ్ వాయిదా పడినట్టే అంటున్నారు. కాకపోతే ఇక్కడ మరో చిక్కు వచ్చింది. రాబిన్ హుడ్ ఇప్పుడు వాయిదా పడితే మళ్లీ కొత్త డేట్ కావాలంటే జనవరి 26 లేదా ఫిబ్రవరికి వెళ్లాలి. ఇప్పటికే ఫిబ్రవరి కూడా ప్యాక్ అయింది. శివరాత్రికి నితిన్ నటించిన తమ్ముడు విడుదలవుతుంది. సో.. ఆ డేట్ డిస్ట్రబ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇవన్నీ మైత్రీ వాళ్లు సెట్ చేస్తారు. కాబట్టి రాబిన్ హుడ్ క్రిస్మస్ బరి నుంచి వాయిదా పడినట్టుగానే భావించాలి. త్వరలోనే కొత్త డేట్ తో వస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com