Nithiin: అభిమాన హీరోతో 'సై' అంటున్న నితిన్.. అదే నమ్మకంతో..
Nithiin: ఈ మధ్య కాలంలో నితిన్ సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యాడు.

Nithiin (tv5news.in)
Nithiin: ఈ మధ్య కాలంలో నితిన్ సినిమాల విషయంలో కాస్త స్లో అయ్యాడు. ఈ ఏడాది మొదట్లో రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుదల చేసిన తర్వాత నితిన్ స్పీడ్ తగ్గించేసి స్క్రిప్ట్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో ఒకేఒక్క సినిమా ఉంది. ఒకేసారి మూడు సినిమాలను ఓకే చేసినా కూడా అందులో ఏ ఒక్కదాని గురించి కూడా సరైన అప్డేట్ లేదు. నితిన్ చేస్తున్న ఒక్క సినిమాతో తన అభిమాన హీరోకు ఎదురెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.
ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రమే 'మాచర్ల నియోజకవర్గం'. ఇందులో నితిన్‌కు జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తోంది. మరో హీరోయిన్‌గా కేథరిన్ నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో పాటు టైటిల్ పోస్టర్‌ను కూడా మూవీ టీమ్ రిలీజ్ చేసేసింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడం మాత్రమే మిగిలున్న ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల మూవీ టీమ్ ప్రకటించింది.
2022 ఏప్రిల్ 29న 'మాచర్ల నియోజకవర్గం' సినిమా విడుదల కానుందని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అయితే అంతకంటే ముందే ఈ డేట్‌ను మరో మూవీ లాక్ చేసింది. అదే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు'.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రానాతో కలిసి చేస్తున్న 'భీమ్లా నాయక్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్.. ఈ రెండు సినిమాల షూటింగ్లను ఒకేసారి పూర్తి చేద్దామనుకున్నాడు పవన్. కానీ అలా కుదరకపోవడంతో ప్రస్తుతం భీమ్లా నాయక్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. దీని తర్వాత వెంటనే హరిహర వీరమల్లు షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారు.
హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే దీని విడుదల తేదీని 2022 ఏప్రిల్ 29గా ప్రకటించింది మూవీ టీమ్. ఆరోజు ఆ సినిమా లాక్ అయినా కూడా నితిన్ అదే రోజున తన సినిమాను బరిలోకి దించాలనుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే హరి హర వీరమల్లు ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకపోవడంతో అది పోస్టపోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని భావించి 'మాచర్ల నియోజకవర్గం' టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
RELATED STORIES
Salman Rushdie : సల్మాన్ రష్దీపై కత్తితో దాడి.. ఏమీచెప్పలేమంటున్న...
13 Aug 2022 2:20 AM GMTUkraine Indian Doctor : ఉక్రెయిన్‌లో తెలుగు డాక్టర్.. పులుల కోసం బాంబు...
11 Aug 2022 10:30 AM GMTNorth Korea: కిమ్ జోంగ్ ఉన్‌కు తీవ్ర అనారోగ్యం: సోదరి వెల్లడి
11 Aug 2022 10:15 AM GMTCuba : క్యూబాలో పేలిన చమురు ట్యాంకర్లు..కారణం అదే..
10 Aug 2022 4:21 PM GMTRussia Ukraine War : రష్యా దాడిలో మరో 13 మంది ఉక్రెయిణిలు మృతి..
10 Aug 2022 3:59 PM GMTLangya Virus : చైనాలో మరో కొత్త వైరస్.. 'లాంగ్యా హెనిపా'.. ఎలాంటి...
10 Aug 2022 3:42 PM GMT