Nithiin : డిజాస్టర్ డైరెక్టర్ తో నితిన్

Nithiin :  డిజాస్టర్ డైరెక్టర్ తో నితిన్
X

కొన్నేళ్లుగా డిజాస్టర్ అనే మాట నితిన్ ఇంటిపేరుగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కావడం లేదు. వస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన ఇష్క్ అప్పుడు నితిన్ ను ఇలాంటి డిజాస్టర్స్ నుంచి గట్టెక్కించింది. విక్రమ్ తర్వాత అనూహ్యంగా అతను శ్రీను వైట్లతో సినిమాకు కమిట్ అయ్యాడు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ బ్యానర్ లోనే నితిన్ చేసిన రాబిన్ హుడ్ దారుణంగా పోయింది. అటు శ్రీను వైట్ల కూడా ఈ బ్యానర్ లో గతంలో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో డిజాస్టర్ ఇచ్చాడు. అయినా వీరిని నమ్మి మైత్రీ ముందుకు వచ్చిందంటే ఆశ్చర్యం. అలాగే ఈ టైమ్ లో శ్రీను వైట్లకు ఓకే చెప్పడం నితిన్ ది అమాయత్వమా.. లేక తప్పులు దిద్దుకోలేని తనమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

నిజానికి శ్రీను వైట్ల రెడీ, ఢీ ఫార్ములా నుంచి ఇంకా బయటకు రాలేదు. వచ్చి చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ అయింది. చివరగా వచ్చిన విశ్వం ఆ ఫార్ములానే ఫాలో అయినా పోయింది. ఓ రకంగా ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన శ్రీను వైట్ల తిరిగి ఫామ్ లోకి రావాలని చాలామందే కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్ లో మార్పులు వచ్చాయి. అందుకు అనుగుణంగా పంథా మార్చితే కానీ వర్కవుట్ కాదు. ఈ విషయంలో శ్రీను వైట్ల అప్డేట్ కావడం లేదు.. ఇటు నితిన్ సైతం అప్డేట్ కావడం లేదు. మరి వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ హిట్ అయితే ఇద్దరూ ఒకేసారి షైన్ అవుతారు. లేదంటే స్టోరీ రిపీట్ అవుతుంది.

Tags

Next Story