Nithiin : మహా శివరాత్రికి వస్తోన్న తమ్ముడు

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న నితిన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న రాబిన్ హుడ్ ఈ క్రిస్మస్ కు విడుదల చేయబోతున్నారు. తర్వాత దిల్ రాజు బ్యానర్ లో శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న సినిమా తమ్ముడు.. షూటింగ్ స్టేజ్ లో ఉంది. తాజాగా ఈ తమ్ముడు గురించిన రిలీజ్ అప్డేట్ తో వచ్చింది టీమ్.
తమ్ముడు టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి చాలామంది రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్ చూస్తుంటే తమ్ముడు సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న మాస్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. నితిన్ ఇప్పటి వరకూ కనిపించని విధంగా ఊరమాస్ లుక్ తో ఉన్నాడు. లుంగీ ఎగ్గట్టి వీపు మీద ఓ చిన్న పాపను ఎత్తుకుని చేతిలో కాగడా పట్టుకుని పరుగు పెడుతున్నట్టుగా ఈ పోస్టర్ సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటోంది.
నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో లయ అతని అక్కగా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం చేస్తున్నాడు. దిల్, శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ దిల్ రాజు బ్యానర్ లో చేస్తోన్న సినిమా ఇది. మొత్తంగా శ్రీరామ్ వేణు నుంచి ఓ అనెక్స్ పెక్టెడ్ కంటెంట్ వస్తున్నట్టుగా ఈ పోస్టర్ తో తేలిపోయింది. ఈ మధ్య రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ బాగా ఆడుతున్నాయి. అలా నితిన్ కూ ఓ హిట్ పడుతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com