Nithiin's Thammudu : తమ్ముడు పెద్దలకు మాత్రమేనా..?

నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన సినిమా ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 4న విడుదల కాబోతోంది. ఈ చిత్రంతో నిన్నటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ తమ్ముడికి అక్కగా నటించింది తనే. తను కాక ఫీమేల్ లీడ్స్ లో ఇంకా సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక నటించారు. టైటిల్ కు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రాబోతోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం మరోసారి హైలెట్ కాబోతోందని ట్రైలర్ తోనే అర్థమైంది. చూస్తుంటే కాంతార తరహాలో విలేజ్ గాడెస్ నేపథ్యంలో కథ సాగేలా ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి తమ్ముడుకి ‘ఏ’సర్టిఫికెట్ వచ్చింది.
మామూలుగా దిల్ రాజు బ్యానర్ మూవీస్ అంటే మాగ్జిమం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. అలాంటిది ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ రావడం కొంత ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. అప్పుడెప్పుడో రామయ్యా వస్తావయ్యా, ఎవడు చిత్రాలకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు దిల్ రాజు సినిమాకు పెద్దలకు మాత్రమే అనే బోర్డ్ తగిలించాల్సి వచ్చింది. పెద్దలకు మాత్రమే అంటే కేవలం రక్తపాతం, హింస ఎక్కువగా ఉండటమే కారణం అనుకోవచ్చు. గతంలో వచ్చిన రామయ్యా వస్తావయ్యా.. డిజాస్టర్ అయితే ఎవడు హిట్ అయింది. మరి ఏ సర్టిఫికెట్ తో పెద్దలకు మాత్రమే అంటూ వస్తోన్న తమ్ముడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com