Nithya Menon : ధనుష్ తో నిత్యామీనన్ ఇడ్లీ కొట్టు

నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న తార నిత్యామీనన్. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు.. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెప్పొచ్చు. ఇటీవలే జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుందీ అందాల భామ.తాజాగా నిత్యా సోషల్ మీడియాలో ఓ పిక్ పంచుకుంది. నిత్యా అండ్ ధనుష్ టీ గ్లాసుల ను చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్ సోషల్ మీడియాలో పంచుకుని.. ‘కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది ఇడ్లీ కడై' అని క్యాప్షన్ జతచేసింది. కాగా ధనుష్, నిత్యా మీనన్ నటిం చబోయే చిత్రం పేరు ఇడ్లీ కొట్టు అని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఎంటంటే? విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీకి ధనుష్ నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు. 'తిరు' చిత్రంలో స్నేహితులుగా కనిపించి అభిమానుల్ని అలరించిన ధనుష్, నిత్య.. మరి ఈసారి తెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com