Nitiin's Robinhood : నితిన్ ఎక్కడా తగ్గడం లేదుగా

Nitiins Robinhood  :  నితిన్ ఎక్కడా తగ్గడం లేదుగా
X

డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ పుష్ప 2 కోసం పోస్ట్ పోన్ చేయించబడింది. నిర్మాతలు మైత్రీ వాళ్లు కావడం.. అప్పటికి పుష్ప 2 స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుండటంతో రాబిన్ హుడ్ ను తర్వాత విడుదల చేద్దాం అనుకున్నారు. అప్పటికీ నితిన్ అప్పుడే రిలీజ్ చేయాలని పట్టుపట్టినా లాభం లేకపోయింది. నిజానికి సంక్రాంతికి గట్టి సినిమాలేం లేవు. రాబిన్ హుడ్ వచ్చినా ఇబ్బంది లేకపోయేది. తర్వాత సంక్రాంతి అన్నారు పోయింది. ఫిబ్రవరీ పోయింది. ఆ మధ్య మార్చి 28 అని డేట్ వేశారు. బట్ అదే రోజు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలవుతుందని చెబుతున్నారు ఆ మేకర్స్. దీంతో నితిన్ రాబిన్ హుడ్ మళ్లీ వాయిదా పడినట్టే అనుకున్నారు. బట్ నితిన్ తగ్గడం లేదు.

రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి నితిన్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ మధ్య ఓ పాట కూడా విడుదల చేశారు. వీళ్లు ఇప్పటి వరకూ డేట్ మార్చలేదు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చినా తగ్గేదే లే అనుకుంటున్నారా లేక అంతా అనుకుంటున్నట్టుగా హరిహర వీరమల్లు ఖచ్చితంగా వాయిదా పడుతుందన్న సమాచారం వీరి వద్ద ఉందా అనేది తెలియదు కానీ.. నితిన్ మాత్రం తగ్గడం లేదు. దర్శకుడుతో కలిసి కొన్ని వెరైటీ ఐడియాస్ తో ప్రమోషన్స్ కు రాబోతున్నారని సమాచారం. ఇందుకోసం హీరోయిన్ శ్రీలీలను కూడా భాగస్వామ్యం చేస్తారట. మరి నిజంగా వీళ్లు మార్చి 28న వస్తారా.. రాగలరా అనేది చూడాలి.

Tags

Next Story