Nitin Chandrakant Desai : సొంత స్టూడియోలో ఉరేసుకున్న బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్

Nitin Chandrakant Desai :  సొంత స్టూడియోలో ఉరేసుకున్న బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్
X
ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్

సినీ పరిశ్రమను గత కొంతకాలంగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరో చేదు వార్త వచ్చింది. బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చనిపోయారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేసిన ఆయన ఈ రోజు తెల్లవారు జామున తన సొంత స్టూడియోలోనే నితిన్ చంద్రకాంత్ విగత జీవిగా కనిపించాడు. ఓ రూంలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

నితిన్ చంద్రకాంత్ దేశాయ్.. జనవరి 25, 1965లో మహారాష్ట్రలో జన్మించారు. 1987లో దూరదర్శన్ లో ప్రసారమైన తమస్ అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సీరియల్ కు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత శ్యామ్ బెనగల్ 'భారత్ ఏక్ కోజ్', 'కోరా కాగజ్', 'స్వాభిమాన' సీరియల్స్ కు కూడా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలా దూరదర్శన్ లో పలు సీరియల్స్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నితిన్ చంద్రకాంత్.. 'చాణక్య' అనే సీరియల్ తో ఆర్ట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఇక ఆ తర్వాత ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హద్ దిల్ దే చుకే సనమ్' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా కెరీర్ లో దూసుకుపోతూనే 'లగాన్(2001)', 'దేవ్ దాస్(2014)', 'జోదా అక్బర్(2008)', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో(2015)', 'లహే రహో మున్నాభాయ్' లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.

అంతేకాదు నితిన్ దేశాయ్ ప్రొడ్యూసర్‌గానూ మారారు. చంద్రకాంత్ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ ను స్థాపించారు. ఆ బ్యానర్‌ లోనే 'ఓల దేశ్‌ దేవీ' అనే భక్తి చిత్రాన్ని నిర్మించారు. బెస్ట్ ఆర్ట్ డైరక్టర్‌గా నాలుగుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న నితిన్ దేశాయ్.. 52 ఎకరాల్లో ఎన్‌డీ స్డూడియోస్‌ ను ఏర్పాటు చేశారు. అందులోనే ఈ రోజు ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిగ్‌ బాస్‌ హిందీ ప్రొగ్రాంకు కూడా నితిత్ దేశాయ్‌ ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేశారు.

20ఏళ్లుగా పలు సినిమాలకు పని చేసిన నితిన్ దేశాయ్ మరణం బాలీవుడ్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యమివ్వాలని ప్రార్ఖిస్తున్నారు.

Tags

Next Story