Nitin Desai: ECL ఫైనాన్స్ ఉద్యోగులపై నితిన్ దేశాయ్ భార్య ఫిర్యాదు

Nitin Desai: ECL ఫైనాన్స్ ఉద్యోగులపై నితిన్ దేశాయ్ భార్య ఫిర్యాదు
X
నితిన్ దేశాయ్ మరణంపై ఆయన భార్య కీలక వ్యాఖ్యలు.. మానసికంగా వేధించారని ఆరోపణలు

బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ పోలీసులు ఎడిల్‌వీస్ గ్రూప్, ఆ కంపెనీ ఈసీఎల్ ఫైనాన్స్ అధికారులతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దేశాయ్ భార్య నేహా దేశాయ్ చేసిన ఫిర్యాదు మేరకు ఖలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ), 34 కింద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. కంపెనీ తీసుకున్న అప్పుల విషయంలో తన భర్త పదే మానసిక వేధింపులకు గురియ్యాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

'లగాన్', 'జోధా అక్బర్' వంటి ప్రశంసలు పొందిన బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన దేశాయ్.. ఆగస్టు 2న రాయ్‌గఢ్ జిల్లాలోని కర్జాత్‌లోని తన స్టూడియోలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కంపెనీ రుణదాతలకు రూ. 252 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో ఈ పనికి పూనుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఇటీవలే దీనిపై విచారణను ప్రారంభించింది.

దేశాయ్ కంపెనీ అయిన ND స్టూడియోస్.. ఆర్ట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 2016, 2018లో ECL ఫైనాన్స్ నుండి రెండు లోన్‌ల ద్వారా రూ. 185 కోట్లు అప్పుగా తీసుకుంది. జనవరి 2020 నుండి ఈ రుణాన్ని చెల్లించడంలో ఆయనకు అనేక ఇబ్బందులు మొదలయ్యాయి. ECL ఫైనాన్స్ అనేది Edelweiss గ్రూప్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ లోని ఓ విభాగం. కాగా జాతీయ అవార్డు గ్రహీత కళా దర్శకుడి అంత్యక్రియలు ఆగస్టు 4న కర్జాత్‌లోని ఆయన స్టూడియోలో కుటుంబ సభ్యులు, సహచరుల సమక్షంలో జరిగాయి.

Tags

Next Story