Nitin Mehta: అప్పుడు ఆర్మీ ఆఫీసర్.. ఇప్పుడు 'అఖండ'లో విలన్..

Nitin Mehta (tv5news.in)
Nitin Mehta: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. 'అఖండ' గురించే. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఈ హిట్ ఊహించిందే అయినా.. ఊహించిన దానికంటే 'అఖండ' ప్రేక్షకులను మరికాస్త ఎక్కువగానే ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే అఖండ రెండు రోజుల కలెక్షన్స్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
బోయపాటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. విలన్ పాత్రలు కూడా సమానంగా పవర్‌ఫుల్‌గా, బలంగా ఉంటాయి. అలాగే అఖండలో కూడా బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్‌ను పెట్టారు బోయపాటి. ఇందులో శ్రీకాంత్ క్యారెక్టరైజెషన్, విలనిజం అన్ని చాలా డిఫరెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక శ్రీకాంత్‌తో పాటు అఖండలో మరో విలన్‌గా నటించారు తిన్ మెహతా.
నితిన్ మోహతా విలనిజం కూడా అఖండలో సమానంగా ఆకట్టుకుంది. అయితే ఈయన ఎవరో బాలీవుడ్ నటుడు అయ్యింటాడులే అని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ ఈయన బయోగ్రాఫీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమాలకు, ఈయనకు అస్సలు సంబంధం లేదు. ఆర్మీ ఆఫీసర్‌గా నితిన్ మోహతా జీవితం ప్రారంభమయ్యింది.
నితిన్ మోహతా 21 సంవత్సరాలు ఆర్మీ ఆఫీసర్‌గా దేశానికి సేవ చేశారు. వారి కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితం. నితిన్ తండ్రి కూడా ఆర్మీలో పనిచేసినవారే. నితిన్.. ఒక యుద్ధం సమయంలో గాయాలపాలయ్యారు. దీంతో ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఆర్మీ ఆఫీసర్‌గా ముగిసిపోయిన ఆయన జీవితం కొత్త టర్న్ తీసుకుంది.
గడ్డంతో హ్యాండ్‌సమ్ కనిపించే నితిన్ మోహతాను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన ఓ వ్యక్తి.. తనకు సినిమా ఆఫర్ ఇచ్చాడు. కానీ నితిన్ మాత్రం ఈ ఐడియా ఏదో బాగుంది అనుకుని మోడలింగ్ కెరీర్ ప్రారంభించాలనుకున్నారు. ఆర్మీ నుండి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ అనగానే తన తండ్రి ఒప్పుకోలేరట. అయినా ఎలాగోలా తండ్రిని ఒప్పించి మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించారు నితిన్ మోహతా.
మోడల్‌గా నితిన్ పోర్ట్‌ఫోలియో చూసి ఒక పెద్ద సంస్థ తనకు ప్రొఫెషనల్ మోడల్‌గా ఛాన్స్ ఇచ్చింది. 44 ఏళ్ల వయసులో 88 కేజీల బరువుతో ఆయన మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. కానీ కొద్దికాలంలోనే ఫిట్‌గా తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమాలకంటే ముందు నితిన్.. అక్షయ్ కుమార్‌తో కలిసి ప్రైవేట్ సాంగ్స్‌లో నటించారు.
తెలుగులో అఖండలో గజేంద్ర సాహు పాత్రతో నితిన్ మెహతా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. విలన్‌గా నితిన్‌కు టాలీవుడ్‌లో మరికొన్ని ఛాన్సులు దక్కుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. అఖండ విజయంపై నితిన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను తన ఫ్యామిలీతో చూసిన నితిన్.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com