Nitya Menon: ఆ హీరో మంచి ఫ్రెండ్.. పెళ్లి చేసుకోమని ఎప్పుడూ చెప్తుంటాడు : నిత్యా మీనన్

Nitya Menon: ఆ హీరో మంచి ఫ్రెండ్.. పెళ్లి చేసుకోమని ఎప్పుడూ చెప్తుంటాడు : నిత్యా మీనన్
Nithya Menon: అందమైన అపరంజి బొమ్మలా ఉండే నిత్యా మీనన్‌కి తల పొగరు ఎక్కువ అని ఎవరెన్ని కామెంట్లు చేసినా ఏమీ పట్టించుకోదు..

Nithya Menon: అందమైన అపరంజి బొమ్మలా ఉండే నిత్యా మీనన్‌కి తల పొగరు ఎక్కువ అని ఎవరెన్ని కామెంట్లు చేసినా ఏమీ పట్టించుకోదు.. ఎవరికీ వివరణ ఇవ్వాలని అనుకోదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కథలని ఓకే చేస్తుంది. గ్లామర్ గాళ్‌గా కంటే అభినయం ఉన్న పాత్రలకే ఓటేస్తుంది. అందుకే ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. అలనాటి సావిత్రిని గుర్తుకు తెచ్చే సౌందర్యం, అభినయం. ఆమె నటించిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.

ఈ మధ్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది నిత్య పేరు. పెళ్లిపై రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటిపై క్లారిటీ ఇచ్చినా నిత్యని అవి ఒక పట్టాన వదిలేటట్లు కనిపించట్లేదు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.



కాలికి ఫ్రాక్చర్ అయి రెస్ట్ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించారు. మరి పెళ్లి చేసుకోమని దుల్కర్ మీకు సూచించారట కదా అని అడిగితే.. అవును తను నాకు చాలా మంచి ఫ్రెండ్.. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని ఎప్పుడూ చెబుతుంటాడు.. అయితే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలియదు అని చెప్పుకొచ్చింది నిత్య.

ఇండస్ట్రీలో చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందికి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. వాటన్నిటి గురించి పట్టించుకొని నా టైమ్‌ని వేస్ట్ చేసుకోను. వాటిపై దృష్టి పెడితే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు అని చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story