Aadhi Pinisetty : ఆది పినిశెట్టికి బంపర్ ఆఫర్

Aadhi Pinisetty :  ఆది పినిశెట్టికి బంపర్ ఆఫర్
X

హీరోగా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ లు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు ఆది పినిశెట్టి. తర్వాత విలన్ గానూ అదరగొడుతున్నాడు. మంచి వాయిస్ తో పాటు అద్భుతమైన నటన చూపించగల ప్రతిభావంతుడుగా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా మయసభ అనే వెబ్ సిరీస్ తో మరోసారి గొప్ప నటన చూపించాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తోన్న అఖండ 2 తాండవంలో ప్రధాన విలన్ గా నటించబోతున్నాడు. అంతకు ముందు బోయాపాటే అతన్ని సరైనోడు తో స్ట్రాంగ్ విలన్ గా ప్రెజెంట్ చేశాడు. కెరీర్ ఆరంభం నుంచీ తమిళ్ లోనూ రాణించే ప్రయత్నం చేస్తున్నాడు ఆది. కానీ హీరోగా అక్కడా కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఈ టైమ్ లో ఓ బంపర్ ఆఫర్ అతని తలుపు తట్టింది.

టాలెంటెడ్ యాక్టర్ కార్తీ హీరోగా నటించే సినిమాలో ఆది పినిశెట్టిని విలన్ గా తీసుకున్నారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే.. ఈ పాత్రకు ముందుగా మళయాల నటుడు నివిన్ పాలీని తీసుకున్నారు. అతనికి డిఫరెంట్ మేకోవర్ చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు అతను ఈ సినిమాలో నటించేందుకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదట. అందుకే తప్పుకున్నాడు. అతని ప్లేస్ లో ఆదిని తీసుకున్నారు.

కార్తీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందతోబోతోన్న ఈ మూవీ పేరు ‘మార్షల్’. గతంలో టానాక్కారణ్ అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ చాలా ప్రతిభావంతుడు అన్న పేరు ఉంది. నటుడుగానూ ఇప్పటికే అనే సినిమాల్లో మంచి నటన చూపించాడు. దర్శకుడుగా డిఫరెంట్ రూట్ లో వెళుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగానూ రూపొందించే ఆలోచనలో ఉన్నారట.ఈ మూవీ పూర్తయ్యాకే కార్తీ ఖైదీ 2 చేయబోతున్నాడు. మొత్తంగా నివిన్ పాలీ తప్పుకోవడం ఆది పినిశెట్టికి కలిసొచ్చింది. ఈ పాత్ర హిట్ అయితే అతను తమిళ్ లో కూడా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతాడు.

Tags

Next Story