Vijay : గోట్ కొన్నవాళ్లు షీప్ కారు కదా

Vijay :   గోట్ కొన్నవాళ్లు షీప్ కారు కదా
X

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ ఈ గురువారం విడుదల కాబోతోంది. విజయ్ సినిమానే అయినా చాలామంది ఆర్టిస్టులు, చాలామంది మాజీ హీరోలూ ఉన్నారు. స్నేహ, లైలా లాంటి మాజీ హీరోయిన్లు కూడా కీ రోల్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుదేవా, ప్రశాంత్, వైభవ్, మైక్ మోహన్ లాంటి స్టార్ కాస్ట్ కూడా ఉంది. తెలుగులో కస్టడీ మూవీతో డిజాస్టర్ చూసిన వెంకట్ ప్రభు ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి వెళుతున్నా ఇక సినిమాలకు గుడ్ బై.. గోట్ తర్వాత మరొక్క సినిమా మాత్రమే చేస్తా అని ప్రటించి ఉన్నాడు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీకి తమిళ్ లో ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం మినిమం బజ్ కూడా రాలేదు.

తెలుగులో గోట్ ను అస్సలు ప్రమోట్ చేయలేదు. అంతమంది స్టార్స్ లో కనీసం ఓ ముగ్గురు నలుగురితో అయినా ఇంటర్వ్యూస్ ఇప్పించి ఉంటే కొంత ఇంపాక్ట్ ఉండేది. ఇక్కడ మైత్రీవాళ్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 12 కోట్లు వసూలు చేసే బాధ్యతతో రిలీజ్ కాబోతోంది గోట్. పైగా తెలుగు ప్రేక్షకులు ఈ ట్రైలర్ పై నెగెటివ్ కమెంట్స్ ఎక్కువగా చేశారు.

విజయ్ కి తెలుగులో అభిమానున్నారు. కానీ వాళ్లేం హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాదు. వీరి వల్ల ఓపెనింగ్స్ వస్తాయనే గ్యారెంటీ అస్సలు లేదు. ఇలాంటి ప్రమోషన్సే లేకుండా విడుదల చేయడం అనేది హై రిస్క్. విశేషం ఏంటంటే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా తూతూ మంత్రంగానే జరిగింది. మొత్తంగా సిట్యుయేషన్ చూస్తుంటే గోట్ ను కొన్నవాళ్లు బలిగొర్రెలు కాబోతున్నారా అనిపిస్తోంది.

Tags

Next Story