Rashmika Mandanna : పుష్ప 2లో రష్మిక పాత్ర కరివేపాకేనా..?

పుష్ప 2 .. కొన్నాళ్లుగా ఈ మూవీ గురించి తెగ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు పుష్ప రాజ్. ఆంధ్ర ప్రదేశ్ లో అల్లు అర్జున్ పై ఒక వర్గం వ్యతిరేకంగా ఉన్నా.. ఇంతకు ముందెప్పుడూ లేనంత బిజినెస్ అయ్యింది అక్కడ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే 200 కోట్ల బిజినెస్ అయింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంది. ఓవర్శీస్ లో కూడా రికార్డ్స్ వచ్చే అవకాశాలున్నాయి. అటు నాన్ థియేట్రికల్ గా ఇప్పటికే 500 కోట్ల మార్క్ ను టచ్ అయింది పుష్ప 2. ఇదంతా అల్లు అర్జున్ సెంటర్ పాయింట్ గా కనిపిస్తోంది. సుకుమార్ గురించి కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. బట్ శ్రీ వల్లి రష్మిక మందన్నా గురించి పట్టించుకున్న వాళ్లే లేరు.
చూసేకీ అగ్గిరవ్వ మాదిరి అనే పాటలో అదరగొట్టింది రష్మిక. అయినా పుష్ప 2కు సంబంధించి ఆమె గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. నిజానికి ఫస్ట్ పార్ట్ లో ఆమె హీరో లవ్ ఇంట్రెస్ట్ గా తప్ప.. ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీలో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర కాదు. పైగా అదే పార్ట్ లో పెళ్లి కూడా అయిపోయింది. అలాంటప్పుడు ఇంక ఆ క్యారెక్టర్ కు ఇంకేం ప్రాధాన్యత ఉంటుంది అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ పార్ట్ లో ప్రధానంగా ఫహాద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్యే ఫైట్ కనిపించబోతుంది. అలాగే టైటిల్ కు తగ్గట్టుగా పుష్ప రూలింగ్ ఎలా ఉంటుందనేదీ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉంటుంది తప్ప.. కథలో ఏమంత ప్రాధాన్యం లేని శ్రీ వల్లి రోల్ కు అంత సీన్ ఉంటుందనుకోలేం.
కాకపోతే ఈ పార్ట్ లో తన పాత్ర చనిపోతుందని.. ఆ ఎపిసోడ్ హైలెట్ గా ఉంటుందనే రూమర్స్ కూడా కొన్నాళ్ల క్రితం వచ్చాయి. ఏదేమైనా పుష్ప 2లో రష్మిక పాత్ర కూరలో కరివేపాకు మాదిరి ఉండబోతోందనే టాక్స్ పెరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com