ఏం మాట్లాడినా విమర్శిస్తారు.. కానివ్వండి: రేణూ దేశాయ్

ఏం మాట్లాడినా విమర్శిస్తారు.. కానివ్వండి: రేణూ దేశాయ్
అప్పుడూ నిజమే చెప్పాను.. ఇప్పుడూ నిజమే చెబుతున్నాను.. అయినా తిడుతున్నారు..

అప్పుడూ నిజమే చెప్పాను.. ఇప్పుడూ నిజమే చెబుతున్నాను.. అయినా తిడుతున్నారు.. కానివ్వండి. మీకు అందులోనే ఆనందం ఉందంటే నేనేం చేయలేను అని రేణూదేశాయ్ తాను తాజాగా చేసిన వీడియోపై వచ్చిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. తనపనేదో తాను చేసుకుంటున్నా ఏ మాత్రం ఆలోచన లేకుండా వివాదాల్లోకి లాగుతుంటారు.

పవన్ నుంచి విడాకులు తీసుకున్నా ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు, విడాకులకు దారి తీసిన కారణాలు బయటపెట్టలేదు. అయినా ఒక్కోసారి పవన్ ఫ్యాన్స్ నుంచి మరోసారి పవన్ వ్యతిరేకుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బులు తీసుకుని అలా మాట్లాడుతుంది అని అంటున్నారు.. కానివ్వండి.. నాకు ఇలాంటివి తప్పవేమో.. నా తల రాత అని సరిపెట్టుకుంటాను అని రేణూ భావోద్వేగంతో రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story