Sidharth : సోదిలో లేకుండా పోయిన సిద్ధార్థ్ మూవీ

హీరో సిద్ధార్థ్ అంటే ఓపెన్ మైండెడ్. మసులో ఏదైనా అనిపిస్తే అదే బయటకూ అంటాడు. అయితే సినిమా పరిశ్రమలో ఇలాంటివి కష్టం. అయితే ఎదుటి వారిపై నోరు పారేసుకోవడంలోనూ సిద్ధూ ముందే ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి లూజ్ టాక్స్ తో చాలా కాంట్రవర్శీల్లో టంగ్ పెట్టాడు. రీసెంట్ గా పుష్ప 2 పై పడింది అతని నోరు. అతనీ మధ్య తమిళ్ లో ‘మిస్ యూ’ అనే మూవీ చేశాడు. నా సామిరంగా ఫేమ్ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. ఎన్ రాజశేఖర్ దర్శకుడు. ఈ మూవీని ఈ నెల 5న విడుదల చేయాలనుకున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చాడు సిద్ధార్థ్. అయితే అదే రోజున పుష్ప 2 ఉంది కదా అంటే .. ఆ మూవీ ఉంటే నాకేం భయం ఇంక నా సినిమా వల్ల పుష్ప 2కే భయం అన్నాడు. కట్ చేస్తే సినిమాను 13కి పోస్ట్ పోన్ చేశారు. తెలుగులోనే కాదు.. తమిళ్ లోనూ ఇదే డేట్ కు విడుదలైంది.
ఇదే కాదు.. పుష్ప 2 రిలీజ్ తర్వాత కూడా బిహార్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చాలా జనం వచ్చారు అంటే.. ఒక ఊరిలో నాలుగు జేసిబిలు వచ్చినా జనం చూడ్డానికి వస్తారు అని చీప్ గా మాట్లాడాడు. కాకపోతే సినిమా కలెక్షన్స్ చూసి భయపడ్డట్టున్నాడు. అందుకే అన్ని సినిమాలు ఆడాలనే కోరుకుంటా అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ జనం అవేం పట్టించుకోలేదు.
ఇక చెప్పినట్టుగా 13న మిస్ యూ మూవీ విడుదలైంది. బట్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ తో దేశమంతా అట్టుడికిపోయింది. అన్ని మీడియా సంస్థలు ఈ న్యూస్ పైనే ఫోకస్ చేశాయి. ఆడియన్స్ సైతం వేరే పనేం(మిస్ యూ ను చూడ్డం లాంటివి) పెట్టుకోకుండా టివిలు, ఫోన్లకు అతుక్కుపోయారు. అంతే.. సిద్ధార్థ్ మూవీని పట్టించుకున్నవాళ్లే లేరు.
తెలుగులో అయితే మిస్ యూ కు మొదటి రోజు 10 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా లేదు. బుక్ మై షోలో చాలా థియేటర్స్ లో ఒక్క టిక్కెట్టూ అమ్ముడు పోలేదు. దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. అసలా మాటకొస్తే ఈ సినిమా విడుదలైందన్న సోయి కూడా జనాల్లో లేదు అంటే సిద్ధూకు ఇక్కడ ఎంత పరాభవం జరిగిందో అర్థమౌతోంది కదా. మొత్తంగా
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com