Mrunal Thakur : ఒక్క ఫ్లాప్ తోనే పత్తా లేకుండా పోయిన బ్యూటీ
ఏ సినిమా పరిశ్రమలో అయినా టాలెంట్ కంటే హిట్టే ఇంపార్టెంట్. హిట్స్ లేకపోతే కెరీర్ ముగిసిపోతుంది. లేదంటే బ్రేకులు పడుతుంటాయి. తెలుగులోకి సీతారామం అంటూ బ్లాక్ బస్టర్ తో దూసుకువచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్ పరిస్థితి ఇదే ఇప్పుడు. సీతారామంలో తన నటన చూసిన చాలామంది తెలుగులో పాగా వేస్తుందనుకున్నారు. అన్నట్టుగానే ఆ వెంటనే నాని సరసన హాయ్ నాన్న మూవీ పడింది. సినిమా యావరేజ్ అయినా మృణాల్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక హ్యాట్రిక్ కొడుతుంది అనుకుంటోన్న టైమ్ లోనే డిజాస్టర్ పడింది.
విజయ్ దేవరకొండ సరసన చేసిన ద ఫ్యామిలీ స్టార్ మూవీతో మృణాల్ ఠాకూర్ కెరీర్ ముగిసిపోయిందేమో అనిపించేసింది. కేవలం మూడు సినిమాలతోనే తెలుగులో తను కనిపించకుండా పోయింది. మరి ఆఫర్స్ లేక తెలుగులో సినిమాలు చేయడం లేదా లేక తెలుగును పక్కన పెట్టి బాలీవుడ్ పైనే ఫోకస్ చేసిందా అనేది తెలియడం లేదు. ఎందుకంటే తన ఖాతాలో ఇప్పుడు మూడు హిందీ సినిమాలున్నాయి. అయినా ఎప్పటి నుంచో అక్కడే ఉంది. అయినా స్టార్డమ్ రాలేదు. మరి ఇప్పుడు వస్తుందా.. ఇలా రీజనల్ లాంగ్వేజెస్ లో సత్తా చాటితే ఇక్కడెలాగూ ఎప్పుడూ హీరోయిన్ల కొరత ఉంటుంది. కాబట్టి మరో బ్లాక్ బస్టర్ పడితే వెంటనే మూడు నాలుగు ఆఫర్స్ గ్యారెంటీ. బట్ బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కేవలం ఒక్క ఫ్లాప్ తోనే పత్తా లేకుండా పోవడం విశేషం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com