Thandel : అప్పటి వరకూ సినిమాలే లేవా

Thandel  :  అప్పటి వరకూ సినిమాలే లేవా
X

2005 టాలీవుడ్ కు గ్రాండ్ వెల్కమ్ అయింది. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ క్లియర్ గా సంక్రాంతి విన్నర్ గా డిక్లేర్ అయింది. ఆయన కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ ను ఈ మూవీ వసూలు చేయబోతోందనే విషయం కూడా కన్ఫార్మ్ అయింది. ఇప్పటికే మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఓవర్శీస్ లో అంతే టైమ్ లో1.5 మిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది. ఇప్పుడు మరో వీకెండ్ కూడా ఉంది కాబట్టి మరిన్ని భారీ వసూళ్లు వస్తాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇటు డాకూ మహరాజ్ కూడా 100 కోట్లు దాటాడు. గేమ్ ఛేంజర్ మాత్రం పైరేట్ అవడం, రిలీజ్ రోజునే ఆన్ లైన్ లో లీక్ కావడంతో పాటు కంటెంట్ విషయంలోనూ కొంత వెనకబడటంతో అనుకున్నంత వసూళ్లు రావడం లేదు. బట్ చూస్తే సంక్రాంతికి టాలీవుడ్ కాస్త కళకళలాడిందనే చెప్పాలి.

అయితే ఇప్పటి నుంచి మళ్లీ ఫిబ్రవరి వరకూ కాస్త పేరున్న సినిమా అంటూ ఏం కనిపించడం లేదు. అంటే దాదాపు మూడు వారాల వరకు సాలిడ్ మూవీ పోస్టర్ కనిపించడం లేదు. ఈ నెల 24న గాంధీతాత చెట్టు అనే చిన్న సినిమా విడుదల కాబోతోంది. టాప్ డైరెక్టర్ సుకుమార్ కూతురు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ట్రైలర్ చూస్తే అవార్డ్స్ మూవీలాగా ఉంది తప్ప.. ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేసేలా కనిపించడం లేదు. అదే రోజు మళయాల మూవీ ఐడెంటినీని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ.

అంతే.. ఇక జనవరి చివరి వరకు అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కూడా పెద్దగా మూవీస్ లేవు. ఫిబ్రవరి 6న అజిత్ కుమార్, త్రిష నటించిన పట్టుదల ఆ తర్వాతి రోజు నాగ చైతన్య, సాయి పల్లవిల తండేల్ ఉంది. సో.. కొత్త సినిమాలకు సంబంధించి ఇది లాంగెస్ట్ గ్యాప్ అనే చెప్పాలి. మామూలుగా సంక్రాంతి తర్వాతి వారం కొత్త సినిమాలేం కనిపించవు. బట్ ఈ సారి ఆ తర్వాతి మూడు వారాల వరకూ న్యూ రిలీజెస్ లేవు అంటే.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ గ్యాప్ లలో చిన్న చిన్న సినిమాలు క్లియరెన్స్ సేల్ లా వస్తుంటాయి. బట్ అవి క్రౌడ్ పుల్లర్స్ కావు.. థియేటర్స్ ను 100 పర్సెంట్ ఫిల్ చేయలేవు. అదీ మేటర్.

Tags

Next Story