NTR Devara : ఎన్టీఆర్ కు ఫస్ట్ షాక్ ఇచ్చిన ఏ.పి

NTR Devara :  ఎన్టీఆర్ కు ఫస్ట్ షాక్ ఇచ్చిన ఏ.పి
X

ఎన్టీఆర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం కాస్త గుర్రుగానే ఉందని చాలాకాలంగా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ దీన్ని ప్రభుత్వానికి కూడా ఆపాదించలేం. నందమూరి ఫ్యామిలీ కోపంగా ఉంది. అదే ఫ్యామిలీ అల్లుడైన చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ రాజకీయంగా తమకు మేలు కంటే నష్టం జరిగేలాగానే ఎక్కువగా ప్రవర్తించాడనే కోపం ఉందంటారు. అందుకే దేవరకు ఏపిలో షాకులు తప్పవు అని చాలామంది భావిస్తున్నారు. భావించినట్టుగానే దేవరకు ఫస్ట్ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఎన్టీఆర్ లాంటి టాప్ యాక్టర్స్ మూవీస్ అంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా బెన్ ఫిట్ షోస్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. టికెట్ ధర ఎంత ఎక్కువైనా కొనేందుకు వెనకాడరు. ఇంకా చెబితే ఒక స్టార్ హీరో కెపాసిటీ తెలిసేది కూడా ఇలాంటి బెన్ ఫిట్ షోల టైమ్ లోనే రాత్రంతా జాగారం చేసి మరీ ఆ షో ఎప్పుడుంటే అప్పుడు చూస్తారు ఫ్యాన్స్. బట్ ఏపిలో ఈ సారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆ అవకాశం లేదు. యస్.. దేవర మిడ్ నైట్ షోస్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. రాత్రిపూట సినిమాలంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందనే కారణంతోనే ఏపి ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు.

ఓ రకంగా ఎన్టీఆర్ పై కోపం వల్ల దేవరపై కక్ష సాధింపు ఉంటుందని చాలామంది ఊహించిందే. ఆ ఊహలు నిజం చేస్తూ తాజా నిర్ణయం కనిపిస్తోంది. అయితే ఇది కేవలం దేవరకు మాత్రమే ఉంటుందా రాబోయే రోజుల్లో అందరు హీరోల సినిమాలకు మిడ్ నైట్ షోస్ ఉండవా అనేది తెలియాల్సి ఉంది. అఫ్ కోర్స్ పుష్ప 2 కు కూడా ఇదే షాక్ తగులుతుంది. ఆ మేరకు అల్లు అర్జున్ ఆర్మీ ప్రిపేర్ అయి ఉంటేనే బెటర్.

ఇక దేవర విషయానికి వస్తే.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ఇక్కడి ప్రభుత్వం. కాకపోతే రూరల్ ఏరియాస్ లో సింగిల్ స్క్రిన్స్ ను మినహాయిస్తారు అంటున్నారు. ఏపిలో మిడ్ నైట్ షోస్ నే రద్దు చేశారు కాబట్టి.. అక్కడ టికెట్ రేట్ లు పెంచుకునే అవకాశం కూడా పోయినట్టే అంటున్నారు. అదే జరిగితే ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ మూవీకి పెద్ద షాక్ ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే టికెట్ ధరలు పెరిగితేనే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అంటే సామాన్యుడి జేబులు గుల్లయితేనే స్టార్ హీరోలకు రికార్డులు వస్తాయి అనుకోవచ్చు.సో.. ఓ రకంగా మిడ్ నైట్ షోస్.. టికెట్ ధరలు పెంచకపోవడం వంటివి చేయకపోవడం మంచి నిర్ణయమే. లేదంటే అర్థరాత్రిల్లు అభిమానుల హంగామాతో అనేకమంది జనం ఇబ్బంది పడుతుంటారు. అలాగే పెరిగిన టికెట్ ధరల కారణంగానే జనం థియేటర్స్ కు దూరం అవుతున్నారు. సో.. ఇది దేవరకు షాక్ అని వాళ్లు అనుకున్నా.. కామన్ పీపుల్ కు హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి.

Tags

Next Story