Nikhil Siddhartha : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. గాలికి వదిలేశారెప్పుడో..

Nikhil Siddhartha :  అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. గాలికి వదిలేశారెప్పుడో..
X

సినిమా తీయడం కాదు.. రిలీజ్ చేయడం గొప్ప అంటుంటారు. అందుకే రిలీజ్ టైమ్ లో మేకర్స్ చేసే హడావిడీ.. రకరకాల ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ప్రయత్నాలు.. రిలీజ్ వరకూ అబ్బో ఓ రేంజ్ హడావిడీ కనిపిస్తుంది. బట్ అవేం లేకుండా ఆ సినిమా థియేటర్స్ లోకి వస్తోందంటే.. అది కూడా టైర్ 2 హీరో మూవీ అంటే.. దానర్థం ఏంటీ..? యస్.. సినిమా పోతుందని వారికి ముందే తెలుసని. సింపుల్.. ఓ డిజాస్టర్ సినిమాను మోయడం ఎందుకు అనే కారణంతోనో ఏమో.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’అనే సినిమాను ఎప్పుడో గాలికి వదిలేశారు మేకర్స్.

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెలుగుకు తెరకు పరచయం అవుతున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. సుధీర్ కు టేకింగ్ పరంగా బాగా తీస్తాడు అన్న పేరుంది. కంటెంట్ పరంగా మాత్రం క్రైమ్ జానర్ దాటి బయటకు రావడం లేదు. దీంతో స్వామిరారా తర్వాత మరో హిట్ పడలేదు. నిఖిల్ కు సుధీర్ కు మధ్య మంచి స్నేహం ఉంది. అయినా ఇద్దరూ సినిమాను పట్టించుకోవడం లేదు.

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ కు ప్యాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. అది నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందుకే ఈ చిన్న సినిమాను పట్టించుకోవడం లేదు అనే టాకూ వినిపిస్తోంది. మరోవైపు ఈ మూవీని ఆల్రెడీ ఓ ఓటిటి సంస్థకు అమ్మేశారట. అందుకే నిర్మాతలు ఫార్మాలిటీగానే విడుదల చేస్తున్నారు తప్ప.. ఈ మూవీ విజయం సాధిస్తుందని.. కనీసం ఆకట్టుకుంటుందనే నమ్మకం నిర్మాతలకు కూడా లేదు. అందుకే అంతా కలిసి ఈ సినిమాను ఎప్పుడో గాలికి వదిలేశారు అని బలంగా వినిపిస్తోంది.

Tags

Next Story