Suriya : సూర్యను మరీ లైట్ తీసుకుంటున్నారుగా

సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో సూర్య ఒకడు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన రికార్డ్ ఉంది సూర్యకు. గజినీ మూవీతో తెలుగులోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. ఆ తర్వాత అతను చేసిన ఎన్నో సినిమాలు ఇక్కడా మంచి విజయం సాధించాయి. లవర్ బాయ్ నుంచి మాస్ హీరో వరకూ ఏ సబ్జెక్ట్ అయినా తెలుగు వాళ్లు ఆదరించారు. అయితే కొన్నాళ్లుగా సూర్య హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. వచ్చిన సినిమాలన్నీబాక్సాఫీస్ వద్ద బావురుమంటున్నాయి. ఇటు తెలుగులోనూ ఏ సినిమాలూ ఆకట్టుకోవడం లేదు. ఇంకా చెబితే అతని తాజా మూవీస్ కంటే ఎప్పుడో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ రిలీజ్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. అదీ అతని పరిస్థితి. రీసెంట్ గా వచ్చిన కంగువా తనకు ప్యాన్ ఇండియా ఇమేజ్ తెస్తుందని.. భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో కనిపించాడు. కానీ ఆ మూవీ అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయింది.
ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘రెట్రో’అనే మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ ఓకే అయింది. అయితే ఈ రెండు సినిమాల కంటే ముందే వెట్రిమారన్ డైరెక్షన్ లో ‘వాడి వాసలై’ అనే సినిమా అనౌన్స్ అయింది. కానీ ఈ చిత్రం గురించిన అప్డేట్స్ రావడం లేదు. నిర్మాత అదే పనిగా విదేశాల్లో ఈ మూవీ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ జరుగుతున్నాయని.. జురాసిక్ పార్క్ కు పనిచేసిన టీమ్ ఈ చిత్రానికి పని చేస్తుందని చెబుతున్నాడు. కానీ వాస్తవంలో అవేం కనిపించడం లేదు. పైగా వెట్రిమారన్ తాజాగా ధనుష్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో సూర్యను మరీ లైట్ తీసుకున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ సూర్య మూవీ తర్వాత ధనుష్ ప్రాజెక్ట్ ఉంటుందనుకున్నా.. కనీసం ఆ ముక్క కూడా చెప్పడం లేదు. పైగా ఎప్పుడో అనౌన్స్ అయిన సూర్య మూవీ కంటే ఇప్పుడే అనౌన్స్ అయిన ధనుష్ మూవీకే ఎక్కువ ప్రచారం కూడా కనిపిస్తోంది. దీంతో మేకర్స్ మాత్రమే కాదు.. తమిళ్ మీడియా కూడా సూర్యను లైట్ తీసుకుందనే న్యూస్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా స్టార్డమ్ ఎంత ఉన్నా.. హిట్స్ లేకపోతే ఇంతే అని మరోసారి ప్రూవ్ అయింది. కాకపోతే కార్తీక్ సుబ్బరాజ్ చేస్తోన్న రెట్రో కు బ్లాక్ బస్టర్ లుక్ కనిపిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంపై సూర్య కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com