సినిమా

MAA Elections 2021: మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. డిష్యుం.. డిష్యుం

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(Movie Artist Association) మా ఎన్నికల(MAA Elections)కు నామినేషన్లు మొదలు

MAA Elections 2021: మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. డిష్యుం.. డిష్యుం
X

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(Movie Artist Association) మా ఎన్నికల(MAA Elections 2021) నామినేషన్ల పర్వం మొదలైంది. అధ్యక్ష అభ్యర్థిగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఉదయం తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నామినేషన్‌ వేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అక్టోబర్‌ 10న మా ఎన్నికలు జరుగుతాయి.

అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. మా ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానెళ్లు పోటీపడుతున్నాయి. తమ ప్యానెళ్ల తరపున పోటీచేసే సభ్యులను ఇప్పటికే ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు.... ఎన్నికల మ్యానిఫెస్టోలను కూడా విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలతో మా ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES