Mahesh Babu : టాలీవుడ్ లో రీ రిలీజ్ ల వర్షం

Mahesh Babu :  టాలీవుడ్ లో రీ రిలీజ్ ల వర్షం
X

రీ రిలీజ్ కు ఆదరణ తగ్గిపోయినా అభిమానులు ఆగడం లేదు. స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ ను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇందుకు నిర్మాతలు కూడా ముందుకు వస్తుండటంతో ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా మరోసారి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పైగా వీటిని వినోదం కోసం కాకుండా రీ రిలీజ్ ల్లోనూ కాంపిటీషన్ అంటూ పోటీలు పడుతున్నారు. గతంలో కంటే ఇప్పుడు రీ రిలీజ్ లు మరింత పెరిగాయి. ఈ శుక్రవారం మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ మూవీ రీ రిలీజ్ అవుతోంది. భూమిక, గోపిక, మల్లిక, సునిల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. అప్పట్లో పెద్దగా ఆడలేదు కానీ.. తర్వాత క్లాసిక్ అనేశారు.

దీంతో పాటు మహేష్ బాబు ఒక్కడు చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నారు. దీంతో ఇది ఐదోసారి రీ రిలీజ్ అవుతుంది. అలాగే ఏప్రిల్ 26న భరత్ అనేనేను చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో కియార అద్వానీ తెలుగు తెరకు పరిచయం అయింది. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించాడీ చిత్రంలో.

ఇక మే 18న ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన మూడో సినిమా యమదొంగను రీ రిలీజ్ చేస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఆ సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక మే 23న ప్రభాస్, త్రిష జంటగా శోభన్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ వర్షం ను రీ రిలీజ్ చేస్తున్నారు. వర్షం అప్పట్లో యూత్ కు మోస్ట్ ఫేవరెట్ మూవీగా ఉంది. మరి ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.

వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్టాలిన్ ను కూడా రీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీని 4 కే లో కాకుండా ఏకంగా 8 కే లో రెడీ చేస్తున్నారట. మొత్తంగా ఈ సమ్మర్ టాలీవుడ్ అంతా రీ రిలీజ్ లతో నిండిపోతుంది. మరి వీటిలో మళ్లీ విజయం సాధించే సినిమాల సంగతేమో కానీ.. ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు చూస్తుంటే.

Tags

Next Story