Jawan : ఆ నగరంలో షారుఖ్ మూవీ 5AM షో

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన రాబోయే చిత్రం 'జవాన్' కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించినట్లు సెప్టెంబర్ 1 న ప్రకటించారు. సినిమా హాళ్లు, సినిమా టిక్కెట్ల బుకింగ్ వెబ్‌సైట్‌లకు అభిమానులు పోటెత్తడంతో, ఈ చిత్రం ఇప్పటికే భారతదేశం అంతటా 7.5 లక్షల టిక్కెట్‌లను విక్రయించింది. ముంబైలోని ఐకానిక్ గైటీ గెలాక్సీ థియేటర్‌లో 51 సంవత్సరాలలో మొదటిసారిగా 6 AM ప్రదర్శనను ఏర్పాటు చేయగా, ఈ భారతీయ నగరం సెప్టెంబర్ 8, శుక్రవారం నుండి ప్రారంభమయ్యే 5 AM షోతో రానుంది. ఈ సందర్భంగా కోల్‌కతాలోని ప్రసిద్ధ మిరాజ్ సినిమాస్ Xలో ఓ పోస్టు చేసింది. అధిక డిమాండ్ కారణంగా జవాన్ కోసం 5 AM షోను జోడించినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా 'జవాన్' హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇది "సమాజంలోని తప్పులను సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి భావోద్వేగ ప్రయాణాన్ని వివరిస్తుంది" అని మేకర్స్ ఇంతకుమునుపే వెల్లడించారు. ఇక అట్లీ దర్శకత్వం వహించిన జవాన్‌లో విజయ్ సేతుపతి, నయనతార అలాగే దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా సైతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, జవాన్‌ను గౌరీ ఖాన్ నిర్మించారు. గౌరవ్ వర్మ సహ నిర్మాత. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
🌟 Attention @iamsrk Fans! Your love and excitement have spoken loud and clear, and we've listened! 😍📣
— Miraj Cinemas (@MirajCinemas) September 4, 2023
⏰ Introducing a special 5 AM show of #Jawan exclusively at Miraj Cinemas, Kolkata! Because for King Khan, sleep can wait. 🎬🌅
🎫 Don't miss this one-of-a-kind experience.… pic.twitter.com/UzzG0KWtLv
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com