Vijay Deverakonda : పవన్ కళ్యాణే కాదు.. విజయ్ దేవరకొండ కూడా

Vijay Deverakonda :  పవన్ కళ్యాణే కాదు.. విజయ్ దేవరకొండ కూడా
X

మార్చి 28.. ఈ సమ్మర్ ను హాట్ గా స్టార్ట్ చేసే డేట్ అనుకున్నారు. ఆ డేట్ కు మొదట విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతోన్న మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ వేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల అదే తేదీకి అన్నారు. అయితే ఆడేట్ కు పవన్ వస్తే.. తాము నిర్మిస్తోన్న విజయ్ దేవరకొండ సినిమాను పోస్ట్ పోన్ చేస్తాం అని గతంలోనే ప్రకటించాడు నిర్మాత నాగవంశీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు) ఆల్మోస్ట్ వాయిదా పడినట్టే. దీంతో ఇక విజయ్ దేవరకొండ రంగంలోకి దిగుతాడు అనుకున్నారు. బట్ పవనే కాదు.. విజయ్ సినిమా కూడా రావడం లేదు. యస్.. ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా నిర్మాణ సంస్థ సితార బ్యానరే ప్రకటించింది.

హరిహర పోస్ట్ పోన్ అన్న వార్త తెలియగానే వెంటనే నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ ను ఆ డేట్ కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో నితిన్ వర్సెస్ విజయ్ దేవరకొండగా పోటీ ఉంటుందనుకున్నారు. కానీ విజయ్ మూవీని కాకుండ మార్చి 29న మ్యాడ్ 2 ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది సితార బ్యానర్. అంటే విజయ్ దేవరకొండ మూవీ కూడా ఆ డేట్ కు రావడం లేదు అనే కదా అర్థం. ఒకవేళ విజయ్ సినిమా కూడా రిలీజ్ చేసినా.. ఆశ్చర్యం లేదు కానీ.. ఇలా మ్యాడ్ లాంటి హిట్ ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒకే బ్యానర్ రెండు సినిమాలతో వస్తే సమస్య తప్పదు. రీసెంట్ గా సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చిన దిల్ రాజు ఒక మూవీతో దెబ్బైపోయాడు కదా. అలాంటిది రిపీట్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు.

ఏదేమైనా విజయ్ మూవీ కూడా మార్చి 28న విడుదల కావడం లేదు అని పక్కాగా అనుకోవచ్చు. సో.. ఇప్పుడు రాబిన్ హుడ్ వర్సెస్ మ్యాడ్ 2 గా మారుతుంది పోటీ. అయితే మార్చి 27న మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో లూసీఫర్ కు సీక్వెల్ గా ఎంపూరన్ వస్తోంది. అది తెలుగులో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. బట్ రాబిన్ హుడ్, మ్యాడ్ 2.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుంది.

Tags

Next Story