Jayamma Panchayati: జయమ్మ పంచాయితీలో సుమ కాదు.. ముందు అనుకున్న నటి..

Jayamma Panchayati: ఒకరిని అనుకుని కథ రాస్తారు.. మరొకరితో సినిమా తీస్తారు.. ఇండస్ట్రీలో ఇది మామూలే. ఒక్కోసారి అవి హిట్టై అటు నటీనటులకు, ఇటు దర్శకనిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెడుతుంటాయి. యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయితీకి కూడా లీడ్ రోల్ కోసం రమ్యకృష్ణని అనుకున్నారట మొదట దర్శకుడు కలివరపు విజయ్ కుమార్.
అయితే తెలిసినవారు సుమ పేరును ప్రస్తావించడంతో ఆమెకి కథ చెప్పారట. ఆమెకి కథ నచ్చి ఓకే చేయడంతో జయమ్మ పంచాయితీ తెరకెక్కింది. యాంకరింగ్ లో నెంబర్ వన్.. మరి నటన ఎలా ఉంటుందో అని సుమ నటనపై కించిత్ అనుమానం.. టెస్ట్ షూట్ చేయడంతో నమ్మకం వచ్చింది దర్శక నిర్మాతలకి. బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాల్లోకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు.. స్టార్ హీరోలతో పని చేయడం అంత ఈజీ కాదని తెలుసుకున్నారు. కొందరు వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది కథ రాసుకున్నారు.. అదే జయమ్మ పంచాయితీగా తెరకెక్కించారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన జయమ్మ తన గ్రామంలో ఇబ్బందులకు గురవుతుంది. ఆమె చేసే పోరాటం పెద్ద వివాదంగా మారుతుంది. అది ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది అని అన్నారు దర్శకుడు విజయ్ కుమార్. కీరవాణి గారు సంగీతం అందించడం ఈ సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచిందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com