Daaku Maharaaj : ఇక డాకూ మహరాజ్ వంతు
నందమూరి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ అని చెబుతోన్న మూవీ డాకూ మహరాజ్.ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇకపై చేయబోయేవి ఒకెత్తు అన్నట్టుగా ఆయన తాజాగా మాట్లాడాడు. ఆ క్రమంలో వస్తోన్న మూవీ డాకూ మహరాజ్. బాలయ్య నట విశ్వరూపాన్ని మరోసారి చూపించబోతున్న సినిమాగా చెబుతున్నారు. ఫస్ట్ ట్రైలర్ లో బాలయ్య మార్క్ డైలాగ్స్, మాసిజం కనిపించలేదు అనే కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో తాజాగా రిలీజ్ ట్రైలర్ అంటూ మరోటి విడుదల చేశారు. బాలయ్య ఇమేజ్ కు కరెక్ట్ మీటర్ లా కనిపించింది.ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి అనడంలో డౌటే లేదు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మించాడు. ఫారెస్ట్ ఆఫీసర్, డాకూ మహరాజ్ అనే రెండు పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నాడు. ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నారు. యానిమల్ విలన్ బాబీ డియోల్ బాలయ్యను ఢీ కొట్టబోతున్నాడు.ఓ చిన్న పాప సెంటిమెంట్ కూడా సినిమాకు కీలకంగా ఉండబోతోందని ప్రమోషన్స్ ద్వారా తెలుస్తోంది.
ఇక సంక్రాంతి రేస్ లో ఉన్న మూవీస్ లో గేమ్ ఛేంజర్ విడుదలై సత్తా చాటుతోంది. నెక్ట్స్ బాలయ్య వంతు. డాకూ మహరాజ్ తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. కాకపోతే ఎక్స్ ట్రా షో కు హై కోర్ట్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఐదు ఆటలతోనే డాకూ మహరాజ్ సందడి చేయబోతున్నాడు. ఈ సంక్రాంతికి ఆల్రెడీ గేమ్ ఛేంజర్ తో మొదలుపెట్టిన థమన్ ఈ చిత్రానికీ సంగీతం అందించాడు. బాలయ్య మూవీకి ఏ రేంజ్ ఆర్ఆర్ ఉంటే బాక్స్ లు బద్ధలవుతాయో బాగా తెలిసిన థమన్ అదే రేంజ్ లో అదరగొట్టాడు అంటున్నారు.
మొత్తంగా సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాల్లో బాలయ్య డాకూ మహరాజ్ కే ఎక్కువ స్కోప్ ఉందంటున్నారు. మరి అది నిజమా కాదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com