L2E EMPURAAN : ఈ సారి మాలీవుడ్ వంతు

L2E EMPURAAN :  ఈ సారి మాలీవుడ్ వంతు
X

ఇండియన్ సినిమాను సౌత్ సినిమా రూల్ చేస్తోందిప్పుడు. అందుకు తెలుగు సినిమా ఆరంభం అయితే కన్నడ సినిమా కంటిన్యూ చేస్తోంది. ఇటు తెలుగులో వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ఈ విషయంలో ఎప్పుడో ప్యాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకుంది మాలీవుడ్. కాకపోతే వారి మార్కెట్ అంతా ఓటిటి వరకే ఆగింది. అంటే మళయాల సినిమాలకు ఓటిటిలో అన్ని భాషల్లోనూ తిరుగులేని క్రేజ్ ఉంది.

బాహుబలితో రాజమౌళి ప్యాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేస్తే బాహుబలి 2తో కంట్రీస్ సెకండ్ హయ్యొస్ట్ గ్రాసర్ గా నిలిచింది మూవీ. తర్వాత కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ రెండు భాగాలూ దేశాన్ని ఊపేశాయి. ఆపై అనూహ్యంగా కాంతార కదం తొక్కింది. అయితే ఈ విషయంలో కోలీవుడ్ మాత్రం చాలా వెనకబడే ఉంది. ఇప్పటి వరకూ అక్కడి నుంచి ప్యాన్ ఇండియా సినిమా అంటూ రాలేకపోతోంది. చాలా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి కానీ వర్కవుట్ కావడం లేదు. బట్ ఈ సారి మాలీవుడ్ వంతు అనేలా ఉంది.. లేటెస్ట్ గా వచ్చిన ఎంపూరన్ టీజర్ చూస్తే. ఎంపూరన్ అంటే.. మోహన్ లాల్ లూసీఫర్ కు సీక్వెల్.

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన లూసీఫర్ అక్కడ రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. వివేక్ ఓబెరాయ్, మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ఇప్పుడు ఎల్ 2 ఎంపూరన్ అనే టైటిల్ తో మరో సినిమా వస్తోంది. ఈ చిత్రానికీ పృథ్వీరాజే దర్శకుడు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లో లూసీఫర్ కొన్నాళ్లు ఎవరికీ కనిపించడు. ఆ గ్యాప్ లో అతనేం చేశాడు అనే కోణంలో ఈ కథ సాగేలా ఉంది. టేకింగ్ పరంగానూ కంటెంట్ పరంగానూ నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తోంది ఎంపూరన్. మార్చి 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ అఫీషియల్ గా మళయాలం నుంచి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కావడం పక్కా అనిపించుకుంటోంది. సో.. ఈ సారి ఇక మాలీవుడ్ వాళ్లు బాలీవుడ్ పై దండయాత్రం చేయబోతున్నారన్నమాట.

Tags

Next Story