Vijay Devarakonda : అఫీషియల్.. సామ్రాజ్యంగా మారిన కింగ్ డమ్

Vijay Devarakonda :  అఫీషియల్.. సామ్రాజ్యంగా మారిన కింగ్ డమ్
X

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కింగ్ డమ్. ఈ నెల 31న విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సత్యదేవ్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ సంగీతం అందించాడు. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.విజయ్ దేవరకొండ కూడా ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నాడు. అతనికి వరుస ఫ్లాపులు ఉన్నా.. ఈ మూవీ ఓటిటి రైట్స్ ఏకంగా 50 కోట్లకు అమ్ముడు అయ్యాయి. అంటే ప్రాజెక్ట్ పై ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతోన్న కింగ్ డమ్ ఇతర భాషల్లో ఇబ్బంది లేదు కానీ హిందీలో మాత్రం టైటిల్ తో సమస్య అవుతుందట. అందుకే అక్కడ మాత్రం కింగ్ డమ్ టైటిల్ ను తీసేసి 'సామ్రాజ్యం'గా మార్చారు. అసలు కింగ్ డమ్ అంటే తెలుగులో అర్థం కూడా అదే. తెలుగు, తమిళ్ లో ప్రాబ్లమ్ లేదు కానీ హిందీలో ఆ టైటిల్ ఆల్రెడీ వేరే వారు రిజిస్టర్ చేసుకున్నారట. అందుకే సామ్రాజ్యం అని పెట్టారు. ఈ మేరకు హిందీ టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రాన్ని నార్త్ ఇండియాలో ఏఏ ఫిల్మ్స్ వాళ్లు విడుదల చేస్తున్నారు.

Tags

Next Story