Nr. Ntr : ఎన్టీఆర్ - నీల్.. ఎంటర్ ద డ్రాగన్

Nr. Ntr :  ఎన్టీఆర్ - నీల్.. ఎంటర్ ద డ్రాగన్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నాడు. షూటింగ్స్ కు గ్యాప్ వచ్చినా అది కూడా ఏదో ఒక సినిమా కోసమే అయి ఉంటోంది తప్ప.. పర్సనల్ గా వెకేషన్స్ అంటూ ఏం లేవు. ఆల్రెడీ వార్ 2 టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఒక్క పాట మాత్రమే పెండింగ్ లో ఉంది. అది కూడా రిహార్సల్ టైమ్ లో హృతిక్ రోషన్ గాయపడటం వల్ల పోస్ట్ పోన్ అయింది. మరోవైపు మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్న ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇక ఇవాళ్టి నుంచి యంగ్ టైగర్ ‘డ్రాగన్’ సెట్స్ లో అడుగుపెట్టేశాడు. ఇవాళ్టి నుంచి ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తారు అని టాక్.

కొన్ని రోజుల క్రితం మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ తో పాటు అర్జున్ సన్నాఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అటెండ్ అయినప్పుడు అతని లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. చాలా సన్నబడ్డాడు. మొహంలో కళ తప్పింది. బాగా నీరసంగా కనిపిస్తున్నాడు. మరీ ఇంత వెయిట్ లాస్ మంచిది కాదేమో అంటూ రకరకాల మాటలు వినిపించాయి. అయితే ఇది అతి డైట్ కారణంగా తగ్గింది కాదట. ప్రశాంత్ నీల్ సినిమా కోసమే కావాలనే కఠినమైన డైట్ చేసి మరీ తగ్గాడు అని టాక్. ఈ తరహా వీక్ లుక్ సినిమాలో అవసరం ఉందట. అందుకే అతను అంతలా తగ్గాడు అంటున్నారు. మొత్తంగా వచ్చే యేడాది జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ ను సమ్మర్ కు వాయిదా వేశారు అనే టాక్ బలంగా ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ లో ఆదిత్య మ్యూజిక్ కూడా తోడైంది. వాళ్లూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఏదేమైనా ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు కంటే ఈ సారి మరింత వైల్డ్ గా రాబోతున్నాడు అనే టాక్ స్ట్రాంగ్ గా ఉంది.

Tags

Next Story