Nthiin : ఫ్లాప్ డైరెక్టర్ తో నితిన్ సినిమా

ఏదైనా ఇండస్ట్రీలో ఫ్లాపులు ఇచ్చేవాళ్లు కలిస్తే హిట్స్ కొడతారు అనే సెంటిమెంట్ ఉంది. అప్పుడప్పుడూ ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతున్నా.. చాలా వరకూ కసిగా పనిచేస్తారు కాబట్టి విజయాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలా కొన్నాళ్లుగా వీర ఫ్లాపుల్లో ఉన్నాడు నితిన్. ఈ నెల 28న రాబిన్ హుడ్ గా రాబోతున్నాడు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు. భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.
ఎక్స్ ట్రార్డినరీ మేన్ తర్వాత శ్రీలీల మరోసారి నితిన్ తో జత కట్టిందీ సినిమాలో. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రాబిన్ హుడ్ ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా ఉన్నా ఆ స్థాయిలో బజ్ క్రియేట్ కావడం లేదు అనే మాటలూ వినిపిస్తున్నాయి.
రాబిన్ హుడ్ తర్వాత నితిన్ తమ్ముడు మూవీ విడుదలవుతుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కాంతార ఫేమ్ సప్తమిగౌడ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో మాజీ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆపై వేణు ఎల్దండి డైరెక్షన్ లో ఎల్లమ్మ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ సమ్మర్ లోనే స్టార్ట్ అవుతుందని దిల్ రాజు చెప్పాడు. ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపించింది. తాజాగా కీర్తి సురేష్ అని కూడా అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరైనా సినిమాకు హైలెట్ అవుతారు అని చెప్పొచ్చు.
వీటితో పాటు లేటెస్ట్ గా మరో భారీ చిత్రానికి కూడా సైన్ చేశాడు నితిన్. వెరీ టాలెంటెడ్ అనిపించుకున్నా.. హిట్స్ లేక ఇబ్బంది పడుతోన్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించే ఈ చిత్రం భారీ స్థాయిలో ఉంటుందట. సో.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు ఇష్క్ వచ్చింది. ఈ మూవీ నితిన్ కెరీర్ ను మార్చేసింది.మరోసారి ఆ స్టేజ్ లోనే ఉన్నాడు నితిన్. మరి విక్రమ్, నితిన్ ఈ సారి బ్లాక్ బస్టర్ కొడతారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com