NTR 30 : ఎన్టీఆర్30 అప్‌డేట్ వచ్చేసింది..!
NTR 30 : జనతా గ్యారేజ్ మూవీ తర్వాత స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

NTR 30 : జనతా గ్యారేజ్ మూవీ తర్వాత స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రేపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి ఆర్ట్స్ అభిమానులకి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
చేతిలో కత్తి పట్టుకున్న ఎన్టీఆర్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.
పవర్‌ఫుల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్నట్టుగా ఈ వీడియో చూస్తుంటే అర్ధం అవుతుంది. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.