NTR @ 30: ఎన్టీఆర్ '30' సినిమా ఎప్పుడు.. ఫ్యాన్స్ వెయిటింగ్

NTR @ 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తోన్న మూవీ ఎన్టీఆర్ 30. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న ప్రాజక్ట్ కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈ మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులే అవుతుంది.
అప్పటి నుంచి సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ సినిమా ఇంతవరకు మొదలు పెట్టనేలేదు. దీంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది అతిపెద్ద మిస్టరీగా మారింది. అయితే.. ఇప్పుడా సస్పెన్స్‌కి తెరపడింది. ఈ సినిమా షూటింగ్‌కి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రాన్ని 2023 దసరా రిలీజ్ టార్గెట్ గా.. షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగా కొరటాల పక్కాగా ప్లాన్ చేసుకున్నాడట. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న తారక్.. తిరిగి వచ్చిన తర్వాత అతని మేకోవర్ కు సంబంధించి ఫైనల్ టెస్ట్ లు పూర్తి చేసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ లోకి వెళుతున్నట్టు చెబుతున్నారు.
షూటింగ్ మొదలుపెట్టి.. మధ్యలో ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరినట్లు టాక్ వినబడుతోంది. ఇక త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఫ్యాన్స్ హ్యాపీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com