NTR 31 : ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే...?

NTR 31 : ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే...?
X
NTR 31 : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయబోతున్నారు.

NTR 31 : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ విషయం కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కాకముందునుంచే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. నిన్న అనంతపురంలోని నీలకంఠాపురానికి ప్రశాంత్ నీల్ వచ్చారు. అక్కడ దేవాలయాన్ని దర్శనం చేసుకున్న తరువాత మీడియా ఎన్టీఆర్‌తో మూవీ గురించి ప్రశ్నించారు. టైటిల్ ఇంకా డిసైడ్ కాలేదని.. వచ్చే ఏడాది ఎప్రిల్, మేలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ప్రశాంత్ సలార్ మూవీ డైరక్షన్‌లో బిజీ గా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తు్న్నారు. ఈ రెండూ పూర్తవగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల కాంబో సెట్స్ పైకి ఎక్కనుంది. RRR, కొరటాల శివతో మూవీకి 30 సినిమాలు పూర్తి చేసుకోవడంతో.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న దానికి ఎన్టీఆర్31గా వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.

Tags

Next Story