బుల్లితెరపై ఆ సీరియల్‎లో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్

NTR Serial

NTR File Image

NTR: తెలుగు చిత్రసీమలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

NTR: తెలుగు చిత్రసీమలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతేకాదు తన కెరీర్‌లో వెండితెర మీదే కాదు బుల్లితెరపై కూడా కనిపించారు. స్టార్ మాలో వచ్చిన బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేయడంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయాడు.

ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం ద్వారా మళ్లి బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రతో 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. ఇక బిగ్‌బాస్, ఎవరు మీలో కోటీశ్వరులు షోలు కాకుండా తారక్ బుల్లితెరపై ఓ సీరియల్ కూడా చేసాడు.

ఎన్టీఆర్ నటించిన సీరియల్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్ నటించిన సీరియల్ పేరు 'భక్త మార్కండేయ'. ఈ సీరియల్ లో ఎన్టీఆర్ లీడ్ రోల్ మార్కండేయ పాత్ర పోషించారు. శివుడి భక్తుడిగా నటించారు. ఎన్టీఆర్ నటించిన ఈ సీరియల్ అప్పట్లో ఈ టీవీలో ప్రసారం అయింది. ఎన్టీఆర్ రాముడి పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో చిన్న పిల్లలతో తెరకెక్కిన 'రామాయణం' సినిమాలో అలరించారు. ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో రూపొందిన 'నిన్ను చూడాలని' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు.

Bhaktha Markandeya JR. NTR


Tags

Read MoreRead Less
Next Story