NTR 30: డైరెక్టర్‌తో పాటు హీరోయిన్‌ను కూడా రిపీట్ చేస్తున్న ఎన్‌టీఆర్.. క్రేజీ కాంబినేషన్ ఫిక్స్..

NTR 30: ఎన్‌టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయే రోజులు వచ్చేశాయి. టాలీవుడ్‌లో ఇతర హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు విడుదల చేసి హిట్ కొట్టారు. ఇక తరువాతి టర్న్ ఎన్‌టీఆర్‌దే. ప్రస్తుతం ఎన్‌టీఆర్ 'ఆర్ఆర్ఆర్'కు తప్పా ఇంకా ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొని సినిమా రిలీజ్ అయ్యేవరకు మరో సినిమా ప్రారంభించకూడదని ఎన్‌టీఆర్, చరణ్‌లతో చెప్పాడు రాజమౌళి. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది.
ఆర్ఆర్ఆర్ వాయిదా వల్ల హీరోలిద్దరూ వేరేదారి లేక తమ తరువాతి సినిమాలను ప్రారంభించాల్సి వచ్చింది. ఇటీవల శంకర్ సినిమా కోసం చెన్నైకు వెళ్లాడు చరణ్. తారక్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న 30వ చిత్రం కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు చేస్తారన్న విషయం ఎప్పటినుండో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
టాలీవుడ్ మార్కెట్ పెరిగినప్పటి నుండి బాలీవుడ్ భామలు కూడా తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆర్ఆర్ఆర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది ఆలియా భట్. అయితే ఎన్‌టీఆర్ 30వ చిత్రంలో కూడా ఆలియానే హీరోయిన్‌గా నటిస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ కాంబినేషన్ దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను ఎంపిక చేశాడట కొరటాల శివ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com