ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మిస్ చేసుకున్న మల్టీస్టారర్ మూవీ ఇదే..!

తినే మెతుకు మీద మన పేరు రాసుండాలని అంటారు పెద్దలు.. అలాగే ఇండస్ట్రీలో చేసే సినిమాల పైన పలనా హీరో పేరు రాసుండాలి. అవును... ఒక సినిమాకి ఓ హీరోని అనుకోని కథలు రాస్తుంటారు దర్శకులు.. కానీ చివరికి ఆ సినిమా మరో హీరో చేయాల్సి వస్తుంది. అయితే ఇందులో కొన్ని సినిమాలు హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయి.
ఉదాహరణకు అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాని పవన్ కళ్యాణ్‌తో చేయాలనీ అనుకున్నారు పూరీ జగన్నాధ్.. కానీ పవన్ రిజెక్ట్ చేయడంతో రవితేజతో చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు పూరీ. అదే కోవలోకి వస్తుంది రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవడు సినిమా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. కాజల్, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ కథను ముందుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో చేయాలనీ కథను సిద్దం చేసుకున్నారు వంశీ పైడిపల్లి.. కానీ ఈ కథ వారికి అంతగా నచ్చకపోవడంతో రామ్ చరణ్, అల్లు అర్జున్ లను పెట్టి తీశారు. కమర్షియల్ గా మంచి హిట్ అయింది ఈ చిత్రం. ఒకవేళ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేసుంటే వారిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసే అదృష్టం ప్రేక్షకులకి ఎప్పుడో దక్కేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com