NTRNeel : రికార్డుల వేట మొదలుపెట్టిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తోన్న డ్రాగన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ చేసిన మాస్ మూవీస్ ఒకెత్తైతే, ఈ డ్రాగన్ మరో ఎత్తు కాబోతోందనేది చాలామంది నమ్ముతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాలి. కానీ ఆలస్యం అయింది. అయినా ఫర్వాలేదు అన్నట్టుగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సలార్ వంటి మరో ఎపిక్ బ్లాక్ బస్టర్ కొట్టి మరింత ఉత్సాహంగా ఉన్నాడు.
ఇక ఈ మూవీ అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టిందనే వార్తలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాలకు నార్త్ అమెరికా మార్కెట్ అత్యంత కీలకంగా మారింది. అక్కడ మన సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అక్కడి నుంచి ఈ చిత్రానికి ఆల్రెడీ 50 అడ్వాన్స్ గా అందిందట. అంటే రిలీజ్ టైమ్ కు ఈ రైట్స్ డబుల్, త్రిబుల్ కూడా కావొచ్చు. దీన్ని బట్టి ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఎంత భారీ అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిగర్స్ తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే సెకండ్ ప్లేస్ లో నిలిచింది డ్రాగన్.
ఇక రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మళయాల నటుడు టోవినో థామస్, బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 1960ల కాలంలో పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే టాక్ ఉంది. ఈ నెల 22 నుంచి సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com