NTR-Neel Project : బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ తో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్!

NTR-Neel Project : బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ తో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్!

'ఆర్.ఆర్.ఆర్' తర్వాత 'దేవర'తో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించాడు ఎన్టీఆర్. ఇప్పుడు 'వార్ 2'తో బిజీగా ఉన్న తారక్.. త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న చిత్రంకోసం సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే, ఈమూవీ ఒక కొత్త ప్రయోగంగా నిలవబోతుందని స్పష్టంగా తెలుస్తుంది.

ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడట ప్రశాంత్ నీల్. బంగ్లాదేశ్ లో ఇరుక్కున్న ప్రవాస భారతీయులను కాపాడే ఒక శక్తివంతమైన పాత్రలో తారక్‌ కనిపించనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ప్రశాంత్ నీల్ సినిమాలకు బ్లాక్ టోన్ ప్రత్యేకత. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన కొత్త నేపథ్యాన్ని పరిచయం చేయనున్నాడట.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం లొకేషన్ల వేట మొదలుపెట్టాడట. మరోవైపు సెట్స్ నిర్మాణం కూడా జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఎన్టీఆర్-నీల్ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Tags

Next Story