RRR Movie : RRR కోసం ఎన్టీఆర్, చరణ్‌లకు కళ్ళుచెదిరే రెమ్యునరేషన్

RRR Movie : టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్ లో వస్తోన్న లేటెస్ట్ మూవీ RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, అలియా భట్ మెయిన్ లీడ్ లో నటించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు రూ. 45 కోట్లు, అలియా భట్‌రూ. 9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక దర్శకుడు రాజమౌళి అయితే సినిమా నుంచి వచ్చే లాభాల్లో 30 శాతం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించగా, కీరవాణి సంగీతం అందించారు. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలను పెంచేసింది.
#RRRMovie remuneration#NTRJr - ₹ 45 cr#RamCharan - ₹ 45 cr#AliaBhatt - ₹ 9 cr#SSRajamouli - 30% share
— Manobala Vijayabalan (@ManobalaV) March 10, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com