NTR : ఎన్టీఆర్ మరో ఆల్ టైమ్ రికార్డ్

NTR :  ఎన్టీఆర్ మరో ఆల్ టైమ్ రికార్డ్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో రేర్ రికార్డ్ సాధించాడు. దేవర మూవీ విడుదలైన అన్ని చోట్లా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఆల్రెడీ 500 కోట్ల మార్క్ ను ఎప్పుడో దాటేసింది. ఈ మూవీ విడుదలకు ముందున్న అనేక అనుమానాలను బద్ధలు కొడుతూ సింగిల్ హ్యాండెడ్ గా ఎన్టీఆర్ దేవరను బ్లాక్ బస్టర్ చేశాడు. తాజాగా మరో అరుదైన రికార్డ్ అతని ఖాతాలో పడింది. అది కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కావడం విశేషం.

దేవర ఒక్క ఏపిలోనే 100 కోట్ల షేర్ ను అందుకుంది. అది కూడా జీఎస్టీతో కలిపి.రాజమౌళితో మూవీ చేసిన హీరోలు మాత్రమే ఇప్పటి వరకూ ఈ ఫీట్ సాధించారు. అది కూడా కేవలం బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు మాత్రమే అందుకున్నాయి. రాజమౌళి లేకుండా డిజాస్టర్ తో ఉన్న దర్శకుడితో సినిమా చేసి రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరీ ఎన్టీఆర్ ఈ రికార్డ్ సాధించాడు. ఒక రకంగా నాన్ రాజమౌళి పరంగా చూస్తే ఇది ఆల్ టైమ్ రికార్డ్.


మరి ఈ రికార్డుల వేట ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో కానీ.. ఎన్టీఆర్ బలే సాధించాడు అంటున్నారు చూసిన వాళ్లంతా.

Tags

Next Story