NTR : ఎన్టీఆర్ దూకుడు.. ఇక వరుసగా భారీ సినిమాలే

NTR : ఎన్టీఆర్ దూకుడు.. ఇక వరుసగా భారీ సినిమాలే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లానింగ్ ఇప్పుడు రైట్ ట్రాక్ లో పడింది. 2018 నుంచి 2024 ఈ ఆరేళ్ల కాలంలో అతన్నుంచి వచ్చింది అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ అనే రెండు సినిమాలు మాత్రమే. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ గా ఉన్నా.. ఇకపై వచ్చే మూవీస్ అన్నీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ అనే కలర్ కనిపిస్తోంది. ఈ యేడాది సెప్టెంబర్ 27న దేవర 1 విడుదల కాబోతోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్స్ గా నటిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న కాంబినేషన్ కు ముహూర్తం సెట్ అయింది. యస్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ట్రాన్స్ ఫార్మర్’(వర్కింగ్ టైటిల్) అనే మూవీ ఓపెనింగ్ అయిపోయింది. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షయంలో ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. మరి ఎందుకు ఇంత గోప్యత అనేది తెలియదు కానీ.. ఫైనల్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తోన్న కాంబో టెంకాయ కొట్టుకోవడమే కాదు.. ఏకంగా రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. 2026 జనవరి 9న ఈ మూవీని విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. చాలా టైమ్ ఉంది కాబట్టి ఆ డేట్ లో మార్పులేం ఉండవు.

ఇక వచ్చే యేడాది ఆగస్ట్ లో బాలీవుడ్ మూవీ వార్ 2 విడుదలవుతుంది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తోన్న ఈ మూవీతో ఎన్టీఆర్ డైరెక్ట్ గా బాలీవుడ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. సో.. ఆరేళ్లలో రెండు సినిమాలే వచ్చాయి అని ఫీలవుతోన్న ఫ్యాన్స్ కు ఒక యేడాదిన్నర కాలంలో మూడు భారీ సినిమాలు వస్తున్నాయని ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. ఈ మూడిటికి సంబంధించి కీలకమైన విషయం ఏంటంటే.. మొదటగా రాబోతోన్న దేవర 1 బ్లాక్ బస్టర్ కావడం ఇంపార్టెంట్.

Tags

Next Story