NTR : ఏం లుక్కయ్యా.. ఎన్టీఆర్

NTR :  ఏం లుక్కయ్యా.. ఎన్టీఆర్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి ఈ మధ్య అన్నీ నెగెటివ్ వార్తలే వస్తున్నాయి. అతని లుక్ బాలేదు. మేకోవర్ బాలేదు. ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న మూవీ అవుట్ పుట్ విషయం బాలేదు. విలన్ పాత్రధారి తప్పుకున్నాడు. కొన్ని షెడ్యూల్స్ అస్సలు ఎన్టీఆర్ కు నచ్చలేదు అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజమే అని సోషల్ మీడియాలో చూసిన వాళ్లంతా నమ్మేస్తున్నారు. బట్ ఎన్టీఆర్ ఇవన్నీ పట్టించుకోవడం లేదు. తన పనేదో తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఎవడు మొరిగినా నాకవసరం లేదు అనిపించేలా ఉన్నాడు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న మూవీ విషయంలో వస్తోన్న వార్తలన్నీ గాలి కబుర్లుగా తేల్చేసేలా అతని లుక్ ఒకటి వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న మూవీ కోసం ఓ ప్రత్యేకమైన గెటప్ తో కనిపించబోతున్నాడు. అందుకోసం కండలు పెంచుతున్నాడు. తన లుక్, మేకోవర్ ఈ మూవీలో సెకండ్ వెర్షన్ లో మరో స్థాయిలో ఉండబోతున్నాయి అనిపించేయబోతున్నాడు. ఆ కారణంగా తను కండలు పెంచుతున్న ఒక ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో చూసినవాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు. ఇదేంటీ.. ఈ స్థాయిలో తన బాడీ పెంచబోతున్నాడా అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు చూసిన లుక్ కేవలం సినిమాలోని ఒక పాత్రగా కనిపించబోతోంది. ఇకపై మరో పాత్రగా కనిపించబోతోంది అని గతంలోనే కొందరు చెప్పుకున్నారు. ఇప్పుడు అది నిజమే అనిపించేలా ఉన్నాడు. ఏదేమైనా ఎన్టీఆర్ లుక్ మాత్రం సింపులీమైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.

Tags

Next Story