NTR: అభిమాని కోరిక తీర్చిన తారక్..

NTR: అయిన వాళ్లకంటే ఎక్కువగా తమకు నచ్చిన హీరో హీరోయిన్లను ప్రేమిస్తుంటారు సినీ అభిమానులు. సిల్వర్ స్క్రీన్‌పై వారు పోషించే పాత్రలు వారిని మరింత దగ్గర చేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన నటుడిని చూడగలమా అని ఆశ పడుతుంటారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలానికి చెందిన మురళీ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పాడై ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
అయితే ఆయనకు తారక్ అంటే విపరీతమైన అభిమానం. అదే విషయాన్ని ఆయన వైద్యులతో పంచుకున్నారు. విషయం తారక్‌కి తెలిసింది. వీడియో కాల్ చేసి మురళితో, అతడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వచ్చేస్తావు అని తారక్ అతడికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం ఎన్టీఆర్ గారి తన అభిమాని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని ఎన్టీఆర్ గారు మురళి ధైర్యం చెప్పారు. అభిమానులకి ఎప్పుడు అండగా ఉండే ఎన్టీఆర్ గారికి మురళి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ధన్యవాదాలు తెలియజేశారు pic.twitter.com/ZKU9EESlxZ
— vpr (@PrVpr) October 6, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com