NTR 30th Movie: 'ఆచార్య' అలా.. ఎన్టీఆర్ ఇలా

NTR 30th Movie: ఆచార్య అలా.. ఎన్టీఆర్ ఇలా
NTR 30th Movie: ఆచార్య అంచనాలను తలక్రిందులు చేసింది.. చేసిన అయిదు సినిమాలు హిట్ కొట్టినా ఒక్క సినిమాతో కొరటాల శివ గాలంతా తీసేస్తున్నారు నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ..

NTR 30th Movie: ఆచార్య అంచనాలను తలక్రిందులు చేసింది.. చేసిన అయిదు సినిమాలు హిట్ కొట్టినా ఒక్క సినిమాతో కొరటాల శివ గాలంతా తీసేస్తున్నారు నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ.. ఒక్కోసారి టైమ్ బ్యాడ్.. ఎన్నో అనుకుంటాం అన్నీ జరగవు.. ఎక్కడ దెబ్బ కొట్టింది అని పునరాలోచించుకుంటున్నారు కొరటాల. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన చిత్రం వస్తుందంటే ప్రేక్షకులకు పండగే అనుకున్నారంతా.. కానీ సినిమా నిరాశ పరిచింది మెగా ఫ్యాన్స్ ని.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్.. కొరటాలతో చేయాలనుకున్న తన చిత్రాన్ని కొన్ని రోజులు వాయిదా వేయమన్నారు. మరికొన్ని రోజులు కథ మీద వర్క్ చేయమన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసి హిట్ ఇచ్చిన కొరటాల.. ఈసారి మరో అద్బుతమైన కధను ఎన్టీఆర్ కు వినిపించారు. ఆయనకు బాగా నచ్చి ఓకే చేయడంతో ఆచార్య తరువాత సెట్స్ పైకి వెళదామనుకున్నారు.. కానీ ఆ చిత్రాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు.

దాంతో ఎన్టీఆర్ కూడా పునరాలోచనలో పడి కథకు మరికొన్ని హంగులు అద్దీ మళ్లీ కనిపించమన్నారు. అసలే ఇది ఎన్టీఆర్ 30వ చిత్రం.. అభిమానులకు ఈ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉంటాయి. మరి వాటిని రీచ్ కావాలంటే కథలో మంచి పట్టు ఉండాలి. తొలుత జూన్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలనుకున్నప్పటికీ కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిదని భావిస్తున్నారు మేకర్స్.

కధలోని బేసిక్ పాయింట్ విద్యార్థి నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ వాళ్ల హక్కుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి పోరాటం చేశాడన్నది మూల కథగా తెలుస్తోంది. రాజకీయ నాయకులతో ఓ విద్యార్థి నాయకుడు చేసే పోరాటంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story