Devara : ఎన్టీఆర్ దేవర మరో రికార్డ్

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర’ రిలీజ్ కు ముందే పలు రికార్డ్ లను సొంతం చేసుకుంటోంది. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. యూకేలో డాల్బీ అట్మాస్‌లో ప్రదర్శించనున్న తొలి తెలుగు సినిమాగా నిలవనుంది. ఈనెల 26న ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. ట్రైలర్ విడుదలకాక ముందే.. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా 1 మిలియన్ డాలర్లకు చేరిన ఫస్ట్ ఇండియా మూవీగానూ అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడం, చాలా ఏండ్ల తర్వాత ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తుండటంతో ఆడియెన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ‘చుట్టమల్లే’, ‘దావూదీ’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. ‘ఆయుధ పూజ’ పాట నేడు రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. సైఫ్ అలీఖాన్ నెగెటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. దేవర ఫస్ట్ పార్ట్ ఈ నెల 27న రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com