Devara Run Time : ఫ్యాన్స్ ను భయపెడుతున్న దేవర రన్ టైమ్
ఈ నెల 27న విడుదల కాబోతోన్న దేవర మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ యేడాది రికార్డులు బద్ధలయ్యే సినిమాలేం రాలేదు. కల్కి వచ్చింది కానీ ఊహించినంత ప్రభావం చూపించలేదు. దీంతో దేవర రికార్డులు బ్రేక్ చేస్తుందనుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ వస్తే అంచనాలు డబుల్ అవుతాయనుకున్నారు. బట్ అలా ఏం జరగలేదు. దేవర ట్రైలర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇది మేకర్స్ తో పాటు సినిమాను రిలీజ్ చేస్తున్న వారిని కాస్త డిజప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని కొరటాల శివ ప్రీవియస్ మూవీ ఆచార్యతో కంపేర్ చేస్తుండటం మరీ ఇబ్బంది పెడుతోంది వారిని. బట్ సినిమా వచ్చాకేఅసలు రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి.. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలుగానే చూడాలి. ఫస్ట్ షో పడితే కానీ అసలు విషయం తెలియదు.
ఇక లేటెస్ట్ గా దేవర సెన్సార్ పూర్తయింది. ట్రైలర్ తో విపరీతమైన రక్తపాతం కనిపిస్తున్నా.. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి ‘ యూ/ ఏ ’ సర్టిఫికెట్ వచ్చింది. విశేషం ఏంటంటే.. ఈ మధ్య ఏవో కొన్ని తప్ప నిడివి ఎక్కువ అనే కారణంతోనే సినిమాలు పోతున్న సందర్భం చూస్తున్నాం. అయినా దేవర కూడా చాలా పెద్ద లెంగ్త్ తోనే వస్తున్నాడు.
దేవర సినిమా నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. సెన్సార్ తర్వాత ఫైనల్ కట్ ఇది. అంటే ఆల్మోస్ట్ మూడు గంటల సినిమా. యాక్షన్ మూవీస్ కు ఇంత నిడివి ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. కాకపోతే కంటెంట్ ఉంటే లెంగ్త్ పెద్ద మేటర్ కాదు అని ప్రూవ్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ మరీ వర్రీ అవ్వాల్సిన పనిలేదు. సో.. మూడు గంటల పాటు దేవర దుమారం సాగుతుందన్నమాట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com