Devara : పాల్వంచ థియేటర్‌లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ

Devara : పాల్వంచ థియేటర్‌లో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ
X

సాంకేతిక సమస్యతో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులు బీభత్సం సృష్టించారు. థియేటర్లో అద్దాలు, ఫర్నీచర్స్,టేబుల్స్ ధ్వంసం చేశారు. పాల్వంచలోని వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉదయం నుంచి క్యూ కట్టారు. అయితే టెక్నికల్ ప్రాబ్లంతో చిత్ర ప్రదర్శన ఆలస్యం అయ్యింది. దీంతో ఆగ్రహించిన ఫ్యాన్స్ థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. ఫర్నీచర్స్, కుర్చీలు విరగ్గొట్టారు. ప్రొజెక్టర్ లోకి దూసుకెళ్లారు. పాప్ కార్న్స్, కూల్ డ్రింక్స్ తీసుకెళ్లారు. ఈ ఘటనలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వచ్చి శాంతింప చేశారు. అనంతరం సినిమా ప్రారంభం కావడంతో అభిమానులు శాంతించారు.

Tags

Next Story