NTR Birthday Special : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ట్రీట్స్ ఉంటాయా..

NTR Birthday Special :  ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ట్రీట్స్ ఉంటాయా..
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీస్ లైనప్ భారీగా కనిపిస్తోంది.బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 పై అంచనాలున్నాయి. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించిన ఈమూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. కేవలంఈ ఇద్దరికీ సంబంధించిన ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అది కూడా రిహార్సల్స్ లో హృతిక్ కాలు బెణకడం వల్లే ఆలస్యం అయిందన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ కూడా సాగుతోంది. అయితే ఈ మూవీని చాలా దూరం వాయిదా వేయడంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు అనేది నిజం. ముందుగా 2026 జనవరి 9న విడుదల చేస్తాం అన్నారు. తర్వాత మార్చి నెలకు అనుకున్నారు. బట్ ఫైనల్ గా 2026 జూన్ 25న విడుదల చేస్తాం అని లేటెస్ట్ గా అనౌన్స్ చేయడం అభిమానులకు నచ్చలేదు. బట్ బెస్ట్ అవుట్ పుట్ కోసం కాస్త టైమ్ తీసుకున్నా ఫర్వాలేదు అనే సినిమా సామెత ఉంది కదా.?

ఇక మే 20న యంగ్ టైగర్ బర్త్ డే. ఆ సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందా అని మాత్రం ఆశగా చూస్తున్నారు అభిమానులు. ముఖ్యంగా వార్ 2 ను చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటి వరకూ ఈ మూవీ టీజర్ కాదు కదా చిన్న గ్లింప్స్ కూడా రాలేదు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఏదైనా ప్రత్యేకమైన గ్లింప్స్ విడుదల చేస్తే బావుండు అనుకుంటున్నారు. చేయొచ్చు అని కూడా వినిపిస్తోంది.

అలాగే ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లోనూ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశాడు ఎన్టీఆర్. సో.. ఈ మూవీ నుంచీ ఒక గ్లింప్స్ లేదా డైలాగ్ తో కూడిన మోషన్ పోస్టర్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అని వినిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూవీ టైటిల్ డ్రాగన్ కాదు అంటున్నారు. ఓ కొత్త టైటిల్ తోనే వస్తారట. ఆ టైటిల్ ను కూడా బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రెండు సినిమాల నుంచీ ట్రీట్ వస్తే ఫ్యాన్స్ ఆనందం కూడా డబుల్ అవుతుంది కదా.

Tags

Next Story